Telangana | తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం, అమర జ్యోతి అద్భుతం.. ప్రత్యేకతలు ఇవీ..!

Telangana | తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం, అమర జ్యోతి అద్భుతం.. ప్రత్యేకతలు ఇవీ..!

హైదరాబాద్ , మనసాక్షి :

తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు ఆయన అమర జ్యోతిని వెలిగించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు , ఎమ్మెల్యేలు ఎంపీలు , అమరవీరుల కుటుంబాలు హాజరయ్యారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ సన్మానం చేశారు

తెలంగాణ అమరవీరుల స్తూపం ఎంతో ప్రత్యేకతలు కలిగి ఉంది. అమర జ్యోతి వెలుగుతున్నట్లుగా ఉండటం దీని ప్రత్యేకత. ప్రపంచం లోనే ఇది ఒక అద్భుత నిర్మాణం. ఈ అద్భుత కట్టడం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే అవకాశం ఉంది.

 

🔴 ఇవీ ప్రత్యేకతలు

 

🟢 16 , 964 చదరపు అడుగుల వైశాల్యంలో కన్వెన్షన్ హాల్, సీటింగ్ ఏరియా, రెస్టారెంట్, వ్యూ పాయింట్ సర్వీస్, స్టోర్ రూమ్ తో పాటు కిచెన్.

🟢 మొత్తం ఆరు ఫోరలతో నిర్మాణం.

🟢 3.50 ఎకరాల్లో అమర జ్యోతి నిర్మాణం.

🟢 177 కోట్ల రూపాయలతో అమరవీరుల స్తూపం నిర్మాణం చేశారు.

🟢 దీనికి 16 టన్నుల స్టాండ్ లెస్ స్టీల్ ఉపయోగించారు.

🟢 335 కార్లు, 400 బైక్ లకు పార్కింగ్ స్థలం.

🟢 70 సీటింగ్ కెపాసిటీతో మ్యూజియం .

🟢 ఫోటో గ్యాలరీ, ఆడియో విజువల్ రూమ్స్.

🟢 జర్మనీ, అమెరికా, దుబాయ్.. ప్రపంచ దేశాల టెక్నాలజీతో ఈ అమరవీరుల స్థూపం నిర్మాణం చేశారు.

 

ఎక్కువమంది చదివిన వార్తలు మీరు కూడా చదవాలంటే క్లిక్ చేయండి👇

 

♦️ఏవి ఎక్కడ ఉన్నాయంటే..?

 

➡️ మొదటి రెండు బేస్మెంట్లలో పార్కింగ్ స్థలం ఏర్పాటు.

➡️ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎగ్జిబిషన్, పుస్తక ప్రదర్శన.

➡️ మొదటి అంతస్తులో అమరవీరుల ఫోటో గ్యాలరీ, 70 మంది కూర్చునే విధంగా థియేటర్

➡️ రెండవ అంతస్తులు 500 మంది కూర్చునే విధంగా కన్వెన్షన్ హాల్

➡️ మూడవ అంతస్తులో టెర్రస్ పై అద్దాలతో ఏర్పాటుచేసిన రెస్టారెంట్