Forest Jobs : టెన్త్, ఇంటర్ అర్హతతో అటవీ శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం..!

Forest Jobs : టెన్త్, ఇంటర్ అర్హతతో అటవీ శాఖలో ఉద్యోగాలు, దరఖాస్తు విధానం..!

మనసాక్షి , వెబ్ డెస్క్:

అటవీ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు 10వ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

 

హైదరాబాదులోని ఐసిఎఫ్ఆర్ఈ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది. ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

 

🟢 ఎక్కువ మంది చదివిన వార్తలు … మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి 👇
➡️ Latest Jobs : ఏదైనా డిగ్రీ ఉంటే.. ఉద్యోగ అవకాశాలు, భారీ ప్యాకేజీ..!
➡️ RBI : రూ. 30 వేల కంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే.. ఆర్బీఐ క్లారిటీ..!
➡️ Govt Job : నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 81 వేల జీతం..!
➡️ PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు, కస్టమర్లకు రూ. 2 లక్షల ఆదా…!
➡️ RRB Recruitment : 10th అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. ఈనెలాఖరులోగా దరఖాస్తులు..!

 

🟢 ఖాళీల వివరాలు :

లోయర్ డివిజన్ క్లర్క్- 01

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 05

మొత్తం ఖాళీలు – 06

 

🟢 అర్హతలు :

🔥 ఈ పోస్టులకు పదవ తరగతి, ఇంటర్ మీడియట్ విద్యార్హతలు కలిగి ఉండాలి .

🔥 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

🔥 ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి విద్యార్థులకు మూడు సంవత్సరాల సడలింపు ఉంది.

 

🟢 ధరఖాస్తులకు చివరి తేదీ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడానికి 2023 జూలై 31వ తేదీ వరకు అవకాశం ఉంది . ఇది కేవలం ఆఫ్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవలసి ఉంది.

 

🟢 దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

To
The Director,
Institute of Forest Biodiversity,
Dulpally, Kompally S.o,
Hyderabad- 500 100