TSRTC : ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త .. రూ. 50కే రోజంతా ప్రయాణం..!
TSRTC : ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త .. రూ. 50కే రోజంతా ప్రయాణం..!
కంగ్టి, నారాయణఖేడ్, మన సాక్షి :
గ్రామీణ పట్టణ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త తెలియజేసింది ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు రోజువారి పాస్ స్కీమును తీసుకువచ్చింది రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఈ నూతన స్కీంను ప్రారంభించారు టీ 9 (30) రోజు వారి పాస్ 50 రూపాయలుగా నిర్ణయించారు. ఆర్టీసీ సంస్థ ఎండిగా సజ్జనార్ బాధితులు స్వీకరించిననాటి నుంచి ప్రజలకు ఆర్టీసీని మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నారు.
ఆర్టీసీలో అనేక పథకాలను ప్రవేశపెడుతూ ప్రయాణికులకు చేరువ అవుతుంది. అందులో భాగంగానే గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వారికి గురువారం నుంచి టీ9 (30) రూ.50లకు రోజువారి పాస్ ను అందజేయనున్నారు. 50 రూపాయల తో టికెట్ కొనుగోలు చేసి ప్రతి ప్రయాణికుడు రాను పోను 30కి.మీ ప్రయాణించేలా నూతన పథకం ప్రవేశపెట్టారు.
ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. నారాయణఖేడ్ డిపో మేనేజర్ మల్లెషయ్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
టి 9 టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించే వారికి ఒక్కొక్కరికి 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ఆదా అవుతుందని తెలిపారు.
ALSO READ :











