Viral : నీ ఏడుపు చల్లగుండ.. కళ్ళు పోయాలా ఏడ్చిండు..!

Viral : నీ ఏడుపు చల్లగుండ.. కళ్ళు పోయాలా ఏడ్చిండు..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

ఏకధాటిగా ఏడ్చి రికార్డులు సృష్టించాలని అనుకున్నాడు నైజీరియా యువకుడు. ఏడు రోజులపాటు ఏడ్చి గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కాలి అనుకున్నాడు. రికార్డుల మాట ఎలా ఉన్నా.. గిన్నిస్ బుక్ రికార్డు అతని ప్రయత్నాన్ని నమోదు చేయకపోగా పలు రుగ్మతలు చుట్టు ముట్టాయి.

 

తాత్కాలికంగా అతడి కంటిచూపు కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా తలనొప్పి , కళ్ళు వాచిపోవడం, ఎర్రబారిపోవడం వంటి అనారోగ్య లక్షణాలతో ఇబ్బంది పడాల్సి వచ్చింది.

 

ALSO READ : Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?

 

నైజీరియా కు చెందిన టెంబు ఎబిరే గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించేందుకు ఏడు రోజులపాటు ఏడుస్తూ ఉండాలని సిద్ధమై తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో పలు రుగ్మతలు చుట్టుముట్టాయి. 45 నిమిషాల పాటు కంటి చూపును కోల్పోవడం తో గందరగోళానికి గురయ్యాడు.

 

దానికి తోడు విపరీతమైన తలనొప్పి , ముఖం, కళ్ళు వాచిపోవడంతో మధ్యలోనే తన ప్రయత్నాన్ని విరమింప చేశాడు . టెంబు తన రికార్డు ప్రయత్నాన్ని గిన్నిస్ బుక్ నిర్వాహకులకు ముందస్తుగా తెలియజేయకపోవడంతో వారు దాన్ని నమోదు చేయలేదు.

 

ALSO READ : Rain : తెలంగాణలో మూడు రోజులు అతి భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..!