Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!
TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!
హైదరాబాద్ , మన సాక్షి :
టిఎస్పిఎస్సి గ్రూప్ – 2 పరీక్షలను వాయిదా వేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు అభ్యర్థుల డిమాండ్ ఫలించింది. పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది.
తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయడంతో పాటు రీ షెడ్యూల్ ను ఆదివారం విడుదల చేసింది. గ్రూప్ – 2 పరీక్షలు నవంబర్ 2 , 3 తేదీలలో నిర్వహించనున్నది. పరీక్ష నిర్వహణకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు టిఎస్పిఎస్సి ప్రకటించింది.
ఈనెల 29, 30వ తేదీలలో నిర్వహించాల్సిన గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల డిమాండ్ ఆధారంగా పరీక్షలను వాయిదా వేసినట్లు కమిషన్ పేర్కొన్నది.
ALSO READ :









