Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

సమ్మె ఉద్యోగుల జన్మ హక్కు..!

సమ్మె ఉద్యోగుల జన్మ హక్కు..!

సెకండ్ ఏఎన్ఎం లకు అండగా కాంగ్రెస్ పార్టీ

జగిత్యాల ప్రతినిధి, (మన సాక్షి):

సమ్మె ఉద్యోగుల జన్మ హక్కు అని, సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎం లను విధులకు రావాలని అధికారులు భయపెట్టడం సమంజసం కాదని వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భరోసా ఇచ్చారు.

 

జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట జిల్లాలోని సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలని ఏఐటియూసి అనుబంద తెలంగాణ ఏఎన్ఎం ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాండ్ల మధురిమ నాయకత్వంలో జరుగుతున్న సమ్మె మంగళవారం 14 వ రోజుకు చేరుకోగా ఏఎన్ఎంల దీక్షా శిబిరానికి డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి ,గొల్లపల్లి సర్పంచ్ ముస్కు నిశాంత్ రెడ్డి లు వెళ్లి సంఘీభావం తెలిపారు.

 

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్, విజయలక్ష్మి లు మాట్లాడుతూ గ్రామాల్లో అంటురోగాలు, ఇతర వ్యాధులు ప్రబలితే డాక్టర్లు కాదని ప్రజలతో మమేకమై ఏఎన్ఎం లు వైద్య సేవలు అందిస్తుంటారని గుర్తు చేశారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబాలను వదిలి సేవలందిస్తే ఇతర డిపార్ట్మెంట్ లో పనిచేసిన వారిని రెగ్యులరైజ్ చేసి వీరిని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.

 

ALSO READ : 

  1. ఓట్లు మావే సీట్లు మాకే అంటూ.. భారీ బైక్ ర్యాలీతో గళమెత్తిన బీసీ నాయకులు..!
  2. Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!
  3. Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
  4. Tragedy : ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అనారోగ్యంతో కూతురు మృతి.. ఆ తర్వాత తండ్రి కూడా..!
  5. NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?

అధికార బిఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవడం, మద్యం, డబ్బులు పంచి ఏవిధంగా అధికారంలోకి రావాలనే తాపత్రయం తప్పా నిత్యం ప్రజల్లో ఉంటున్న ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించకపోవడం బాధాకరమన్నారు.గత జులై నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలని లక్ష్మణ్ కుమార్, విజయలక్ష్మి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

అందరూ ఐక్యంగా ఉంటే ప్రభుత్వం దిగివస్తుందన్నారు. మధురిమ మాట్లాడుతూ మేము రోడ్డెక్కే పరిస్థితికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమన్నారు. ఆరోగ్య శాఖలో కీలకంగా పనిచేస్తున్న మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి రాష్ట్రంలోని సుమారు 6 వేల మందికి న్యాయం చేయాలని మధురిమ సీఎం కి విజ్ఞప్తి చేశారు.

 

మాకు న్యాయం జరిగేవరకు శాంతియుత పోరాటం చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నిరజ, పద్మ, ఎలిజబెత్ ఊర్మిల శిరీష మేరీ శారద శిరీష జయప్రద ప్రశాంతి జమున స్వరూప చిలుకమ్మ సుజాత,గణిత సరోజ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు