Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

గణేషుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు

గణేషుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

దమ్మపేట, మన సాక్షి :

అశ్వారావుపేట(నియోజకవర్గం),దమ్మపేట మండలంలోని నాయుడుపేట, గండుగులపల్లి, లింగాలపల్లి, మాల్కారం, మందలపల్లి ప్రకాష్ నగర్ కాలని మల్లారం,వెంకటాద్రిగూడెం గ్రామాల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పర్యటించి గణేషుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా వడ్డించారు.

ALSO READ : జగన్ కు శుభాకాంక్షలు చెప్పిన లోకేష్.. ఎందుకో తెలుసా..!

అనంతరం అక్కడే ఉన్న మహిళలతో ఆత్మీయంగా మాట్లాడుతూ సమయం గడిపారు. గ్రామ మహిళలు మరియు పెద్దలు ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి రావాలని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మల్కారం గణేషుడి మండపం వద్ద నిర్వహించి వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ఎమ్మెల్యే అందజేశారు.

ALSO READ : Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!

అలాగే అదే గ్రామంలో తాండ్ర మహేశ్వరరావు ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,అంకత ఉమా మహేశ్వరరావు,జలగం వాసు,సర్పంచ్ లు రూప సింగ్ వాడే జయమ్మ శ్రీను,రాజేశ్వరి రాజు,కో ఆప్షన్ సభ్యులు బుడే,దమ్మపేట ఉప సర్పంచ్ దారా యుగంధర్,రావూరి వీరయ్య,బత్తుల మురళి, బుద్దే సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు .

ALSO READ : Car Driver : కారు డ్రైవర్ ఖాతాలో రూ. 9 వేల కోట్లు జమ.. ఒక్కసారిగా షాక్ అయిన డ్రైవర్..!

మరిన్ని వార్తలు