Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESక్రైంజిల్లా వార్తలుతెలంగాణసినిమా

Bigg Boss : బిగ్ బాస్ షోపై తెలంగాణ హెచ్ఆర్సీకి ఫిర్యాదు..!

Bigg Boss : బిగ్ బాస్ షోపై తెలంగాణ హెచ్ఆర్సీకి ఫిర్యాదు..!

మనసాక్షి : బిగ్ బాస్ షో పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (హెచ్ ఆర్ సి) కి ఫిర్యాదు అందింది. బిగ్ బాస్ షో పై సమగ్ర దర్యాప్తు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.

బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన వివాదం, గొడవలు అంతా ఇంతా కావని పేర్కొన్నారు. జరిగిన గొడవలపై రెండు కేసులు కూడా నమోదు అయినట్లు ఆయన పేర్కొన్నారు.

ALSO READ : అసెంబ్లీలో హరీష్ రావుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్..!

కానీ ఎక్కడ హీరో నాగార్జున పేరు లేదన్నారు. హీరో నాగార్జునను బాధ్యులను చేయాలని పేర్కొన్నారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన సంఘటనలో 8 ఆర్టిసి బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయని హీరో నాగార్జున పై కేసు నమోదు చేయాలన్నారు.

ఈ మేరకు హెచ్ఆర్సీకి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : తీవ్ర విషాదం.. పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!

మరిన్ని వార్తలు