అసెంబ్లీలో హరీష్ రావుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి బుధవారం ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు

అసెంబ్లీలో హరీష్ రావుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి బుధవారం ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని రేవంత్ రెడ్డి చెప్పగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏడుసార్లు అని చెప్పడంతో రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల వి లెక్కలేసుకోండి.. వాళ్ళ మామ గెలిచినవి కూడా లెక్కలేసుకోండి.. కానీ సాధారణ ఎన్నికలు జరిగింది ఐదు సార్లు ఆయన గెలిచింది కూడా ఐదు సార్లు అంటూ కౌంటర్ ఇచ్చారు.

ALSO READ : Gas cylinder : తెలంగాణలో గ్యాస్ సిలిండర్ రూ. 500 లకే.. ఆ రోజు నుంచే అమలు..!

అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ తెలంగాణ ఉద్యమం సమయంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నీళ్ల వ్యాపారం చేస్తూ అప్పులు తీర్చుతామని బ్యాంకులకు రాసి ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలో ఎప్పుడు నల్ల కనెక్షన్లు.. మంచినీళ్లు చూడలేదా..? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకనే నల్లాలు చూశారా ప్రజలు..? అంటూ కౌంటర్ ఇచ్చారు.

వాళ్లేదో శివుడి తలపై ఉన్న గంగను భూమి మీదికి తీసుకొచ్చి గోదావరి కాళేశ్వరంలో కలిపి.. అక్కడి నుంచి ప్రజలకు గోదావరి నీళ్లు ఇస్తున్నట్లు హరీష్ రావు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ALSO READ : BREAKING : తెలంగాణలో కరోనా కేసులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ప్రాజెక్టుకి ఎంత ఖర్చు చేశారు. ఎంత అప్పు తెచ్చారు. అనే విషయం కాగ్ నివేదిక కూడా తప్పు పట్టిందని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు 97 వేల కోట్లు రూపాయలు అప్పు చేశారని ఆయన పేర్కొన్నారు . ఆ అప్పులు కూడా రైతులకు పంట పొలాలకు నీళ్లు అమ్ముకుంటామని, మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు నీళ్లు అమ్ముకుంటామని వాటి ద్వారా వచ్చే డబ్బులను అప్పులు తీర్చుతామని సంతకాలు పెట్టి అప్పులు తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

అబద్ధాలు చెప్పి తప్పుడు పత్రాలు సృష్టించి ప్రజలనే కాకుండా సభలో ఉన్న సభ్యులను కూడా తప్పుదోవ పట్టించాలని చూసే వారిని సభ నియమాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటారో..? వాటిని పరిశీలించాలని రేవంత్ రెడ్డి స్పీకర్ను కోరారు.

ALSO READ  : నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన.. ఆమెది ఇప్పుడు ఏ పార్టీ అని చెప్పిందంటే..!