నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన.. ఆమెది ఇప్పుడు ఏ పార్టీ అని చెప్పిందంటే..!

ఎమ్మెల్యే గా గెలిచాక ఇక ఇప్పుడు నేను ఏ పార్టీలను చూడననినా పార్టీ ప్రజల పార్టీఅని వారి సమస్యలు తీర్చడమే నా లక్ష్యమని ప్రజల సమస్యలను పార్టీలకు అతీతంగా అందరం పరిష్కరించుకుందాం.

నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన.. ఆమెది ఇప్పుడు ఏ పార్టీ అని చెప్పిందంటే..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ఎమ్మెల్యే గా గెలిచాక ఇక ఇప్పుడు నేను ఏ పార్టీలను చూడననినా పార్టీ ప్రజల పార్టీఅని వారి సమస్యలు తీర్చడమే నా లక్ష్యమని ప్రజల సమస్యలను పార్టీలకు అతీతంగా అందరం పరిష్కరించుకుందాం.

గతంలో ఏం జరిగిందనేది అనవసరం మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో అందరం కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని అభివృద్ధి చేసుకుందామని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెంపర్ణిక రెడ్డి అన్నారు.

మంగళవారం నారాయణపేట మున్సిపాలిటీ సమావేశ మందిరంలో చైర్ పర్సన్ గందేఅనసూయ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా డాక్టర్ చిట్టెంపర్ణిక రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల అనంతరం జరిగిన సమావేశంలో వార్డ్ కౌన్సిలర్లు వాడి వేడిగా తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు.

ALSO READ : Rythu Bandhu : రైతుబంధు డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి..!

కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఎండి సలీం మాట్లాడుతూ తాను కౌన్సిలర్ గా ఎన్నికై నాలుగు సంవత్సరాలు అవుతున్న తమ వార్డులో ఇప్పటివరకు అభివృద్ధి పనులు చేపట్టలేదని ప్రతిపక్ష పార్టీల వార్డులపై వివక్ష చూపుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గతంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ.చిట్టెం నర్సిరెడ్డి ఐ.డి.ఎస్.ఎం.టి పథకం ద్వారా షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలు నిర్మించగా వాటి ద్వారానే నేడు సిబ్బంది జీతభత్యాలు చెల్లిస్తున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీకి ఆదాయ వనరులు సమకూర్చే నిర్మాణాలు చేపట్టలేదన్నారు. మున్సిపాలిటీలో అధికారులకు చేయి తడపందే పనులు చేయడం లేదని, ఈ విషయం పత్రికల్లో కూడా వచ్చిందని ఎమ్మెల్యే దృష్టి కి తీసుకువచ్చారు.

మున్సిపాలిటీలో అవినీతిని నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం 7వార్డ్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కు కౌన్సిలర్ సలీం వినతిపత్రం అందచేశారు. బిజెపి ఫోర్ లీడర్ సత్య రఘు పాల్ రెడ్డి, మరియు రాఘవేంద్ర లు మాట్లాడుతూ

ALSO READ : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయా కు వెళ్లిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.. ఎందుకంటే..!

తమ వార్డులలో సైతం అభివృద్ధి పనులు చేపట్టకుండా వివక్ష చూపుతున్నారన్నారు. పట్టణంలో అనధికారిక కట్టడాలు నిర్మిస్తున్నారని టౌన్ ప్లానింగ్ అధికారి చూసి చూడనట్టు గా వ్యవహరిస్తున్నారని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మటన్ మార్కెట్ ప్రారంభం నోచుకోలేక వృధాగా పడి ఉన్నాయని కోట్లు వెచ్చించి నా ఉపయోగంలోకి లేకుండా పోయానని అనడంతో బి. ఆర్.ఎస్ కౌన్సిలర్లు మేఘ, బండి రాజేశ్వరి,శిరీష, జొన్నల అనిత లు బిజెపి కౌన్సిలర్లతో వాగ్వివాదానికి దిగారు.గతంలో మా మాజీ ఎమ్మెల్యే ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని అనవసరంగా అభివృద్ధి పనులపై తప్పుగా మాట్లాడొద్దన్నారు.

చైర్మన్ కల్పించుకొని వార్డుల వారిగా తమ సమస్యలు ప్రస్తావించాలని కోరడంతో సభ్యులు శాంతించి తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను తీర్చాలని అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా వార్డులను అభివృద్ధి చేసుకుందామని, ఇకనుండి నెల నెల కౌన్సిల్ సమావేశాలు జరపాలని, నేను కూడా అన్ని సమావేశాలకు హాజరైవుతానన్నారు. వచ్చే సమావేశం నాటికి 2014సం. నుండి ఇప్పటివరకు ఎన్ని నిధులు వచ్చాయి, చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు అన్ని తనకు ఇవ్వాలని, ఇప్పటి వరకు అభివృద్ధి చేయని వార్డ్ లకు మొదటి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పర్చే విధంగా చర్యలు తీసుకొవాలని అధికారులను ఎమ్మెల్యేఆదేశించారు.

ALSO READ : Telangana : తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్..!

అంతకుముందు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేను చైర్ పర్సన్ మరియు కౌన్సిలర్లు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో పుర కౌన్సిలర్ లు, కమిషనర్ సునీత, మేనేజర్ యూసఫ్, ఇంజనీర్ మహేష్ హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నరు.

ఎమ్మెల్యే చొరవతో మీడియాకు అనుమతి.
నూతన పుర పాలక చట్టం ప్రకారం గత కొన్ని కౌన్సిల్ సమావేశాలకు మీడియాను అనుమతించని అధికారులు ఈ విషయమై కొన్ని పత్రికల్లో రావడంతో ఆరా తీసిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి కౌన్సిల్ సమావేశానికి మీడియా అనుమతించాలని కమిషనర్ ను ఆదేశించడంతో అధికారులు మీడియాను సమావేశానికి అనుమతించారు.