Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణవ్యవసాయం

Rythu Bandhu : రైతుబంధు డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి..!

Rythu Bandhu : రైతుబంధు డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతుబంధు ద్వారా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రెండు విడతలుగా అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు బంధు తరహాలో రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రైతుల అభ్యున్నతి పై దృష్టి పెట్టారు. రైతులకు అందాల్సిన రైతుబంధు నిధులను విడుదల చేశారు. ఈసారి కి పాత పద్ధతిలోనే రైతుబంధు నిధులు అందజేస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున రెండు విడతలుగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

ALSO READ : Miryalaguda : బి ఎల్ ఆర్ చుట్టూ చేరుతున్న వ్యతిరేక గుంపు..!

ప్రస్తుతం రైతులు యాసంగి పంటలు ప్రారంభించారు. రైతుబంధు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి కొత్త ప్రభుత్వం రైతుబంధు విషయంలో కొంత గందరగోళమైన పరిస్థితి నెలకొన్నప్పటికీ పాత పద్ధతిలోనే రైతుబంధును అందజేస్తామని తెలిపారు. ఒక ఎకరం భూమి సాగు చేస్తున్న రైతుకు ప్రస్తుత సీజన్ లో 5000 రూపాయలను, అర ఎకరం ఉన్న రైతుకు 2500 రూపాయలను వారి వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు.

తక్కువ భూమి ఉన్నా.. కూడా ఇంకా రైతుబంధు రాలేదని కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుబంధు రాకపోతే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ముందుగా రైతుబంధు రాని రైతులు తమ వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. ఆధార్ కార్డు , పట్టాదారు పాసు బుక్కు బ్యాంకు ఎకౌంటు పాస్ బుక్ తీసుకుని వ్యవసాయ అధికారిని కలిస్తే సమస్య పరిష్కరిస్తారు.

ALSO READ : Runa Mafi : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రుణమాఫీ పై కీలక ప్రకటన..!

మొదటగా రైతుబంధు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూస్తారు. ఆ తర్వాత మీకు రైతుబంధు సహాయం డబ్బులు ఎందుకు రాలేదో పరిశీలిస్తారు. ఏవైనా సమస్యలు ఉంటే వ్యవసాయ అధికారులు వాటిని పరిష్కరిస్తారు. ఆ తర్వాత మీకు రైతుబంధు మీ ఖాతాలో జమ అవుతుంది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ALSO READ : BREAKING : జిల్లా కలెక్టర్ గన్ మెన్ తన కుటుంబ సభ్యులను కాల్చి.. తాను ఆత్మహత్య..!

మరిన్ని వార్తలు