Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంహైదరాబాద్

Runa Mafi : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రుణమాఫీ పై కీలక ప్రకటన..!

Runa Mafi : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రుణమాఫీ పై కీలక ప్రకటన..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అదే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజులలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించింది.

అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలను మొదటగా అమలు చేసేందుకు అడుగులు వేస్తుంది. రైతులకు ఇచ్చిన హామీ రుణమాఫీ పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే అసెంబ్లీలో గవర్నర్ తమిళసై కీలక ప్రకటన చేశారు.

తెలంగాణ రైతాంగానికి ఆమె గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు ఆమె అసెంబ్లీలో ప్రకటించారు. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ త్వరలోనే కార్యాచరణ ఉంటుందని ఆమె ప్రకటించారు.

ALSO READ : BREAKING : జిల్లా కలెక్టర్ గన్ మెన్ తన కుటుంబ సభ్యులను కాల్చి.. తాను ఆత్మహత్య..!

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ ను తీసుకురానున్నట్లు చెప్పారు. భూమాత పోర్టల్ అత్యంత పారదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు. అప్పులతో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నం చేశారన్నారు. దుబారా జరిగింది ఎక్కడో..? కనిపెట్టే పనిలో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.

రైతులకు రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సంబంధిత మార్గదర్శకాలను రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఇటీవల ఆదేశించింది. కాగా కొత్త ప్రభుత్వం ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు రుణమాఫీ పై కసరత్తు చేస్తుంది.

ALSO READ : తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి ఏర్పాట్లు..!

కాగా మరోవైపు తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో రుణమాఫీ పై అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తామని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు.

ఎన్నికల ముందు కొంత మేరకు మాఫీ జరిగినా.. పూర్తిస్థాయిలో మాఫీ జరగలేదు. కాగా 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కసరత్తు జరుగుతుంది.

ALSO READ : ప్రభుత్వ చీఫ్ విప్ లుగా నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు 

మరిన్ని వార్తలు