ప్రభుత్వ చీఫ్ విప్ లుగా నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు 

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ లుగా నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ లుగా బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, ఆది శ్రీనివాస్ అడ్లురి లక్ష్మణ్ కుమార్ లకు ప్రభుత్వ చీఫ్ విప్ లుగా నియమించారు.

ప్రభుత్వ చీఫ్ విప్ లుగా నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు 

వేములవాడ, మనసాక్షి

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ లుగా నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ లుగా బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, ఆది శ్రీనివాస్ అడ్లురి లక్ష్మణ్ కుమార్ లకు ప్రభుత్వ చీఫ్ విప్ లుగా నియమించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఈ నలుగురూ మొదటిసారి శాసన సభ్యులయినవారే విశేషం.

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గా ఆది శ్రీనివాస్ నియామకం ;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ప్రభుత్వ చీఫ్ విప్ గా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను
నియమించింది. వేములవాడ ఎమ్మెల్యే గా గత నాలుగు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ పోటీ చేసి ఘన విజయం సాధించారు.

గెలిచిన రెండు వారల్లోనే ప్రభుత్వ చీఫ్ విప్ గా నియామకం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందంతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నారు.