Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : బి ఎల్ ఆర్ చుట్టూ చేరుతున్న వ్యతిరేక గుంపు..!

Miryalaguda : బి ఎల్ ఆర్ చుట్టూ చేరుతున్న వ్యతిరేక గుంపు..!

ఎన్నికల్లో వ్యతిరేకం చేసిన వారు బిఎల్ఆర్ చెంతకు చేరుతున్న వైనం

పనిచేసిన వారందరినీ వెనక్కి నెట్టే ఆలోచన

తమ ఓట్లన్నీ బి ఎల్ ఆర్ కే వేయించినట్టు ప్రచారం

మిర్యాలగూడ , మన సాక్షి :
బత్తుల లక్ష్మారెడ్డి బి ఎల్ ఆర్ అనే వ్యక్తి మిర్యాలగూడ రాజకీయ చరిత్రలో ఓ రికార్డు సృష్టించాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ సాధించుకోవడమే ఆయన ఒక చేసిన గొప్ప ప్రయత్నం. ఆ తర్వాత అత్యధికంగా 50 వేల మెజారిటీతో విజయం సాధించటం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అని చెప్పుకోవచ్చును.

ఆయన గత తొమ్మిది సంవత్సరాలుగా మిర్యాలగూడ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువయ్యారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి మిర్యాలగూడ మున్సిపాలిటీ కైవసం చేసుకునే స్థాయికి తీసుకెళ్లారు.

ALSO READ : మిర్యాలగూడ ఎమ్మెల్యేగా భత్తుల లక్ష్మారెడ్డి ప్రమాణస్వీకారం

మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి సమీప టిఆర్ఎస్ అభ్యర్థి , మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పై 50 వేల మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా బిఎల్ఆర్ కు పార్టీ నాయకులు ప్రచారం చేసి ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీ తెచ్చిపెట్టింది ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అని చెప్పవచ్చును.

బిఎల్ఆర్ చుట్టూ చేరుతున్న వ్యతిరేక గుంపు :

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఎల్ఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కొందరు ఇప్పుడు బిఎల్ఆర్ చెంతకు చేరుతున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వారు ఎక్కడైనా కొంతమంది ఉంటూనే ఉంటారు.

కానీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావుకు ప్రచారం చేసిన వారు సైతం బీఎల్ఆర్ వద్దకు వచ్చి తామే గెలిపించినంతగా ప్రచారం చేసుకోవడం గమనార్హం. కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు మాత్రం పార్టీ కండవాలను కూడా అప్పుడే మార్చేశారు.

ALSO READ : Runa Mafi : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రుణమాఫీ పై కీలక ప్రకటన..!

మరి కొంతమంది పార్టీ కండువాలు మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయ నాయకులే కాకుండా మిర్యాలగూడ పట్టణంలో పలు వార్డులలో బిఎల్ఆర్ కు వ్యతిరేకం చేసిన వారు సైతం బి ఎల్ ఆర్ వద్దకు వెళ్లి ఫోటోలు దిగటం.. అక్కడ ఉన్నవారికి కూడా ఆశ్చర్యం కలిగించే అంశం.

సమాచారం ఇచ్చేందుకే వెళ్తున్నారా.?

బిఎల్ఆర్ గెలుపొందిన నాటి నుంచి ప్రతినిత్యం ఆయన చుట్టూ తిరుగుతూ బిఎల్ఆర్ కార్యాలయానికి వెళ్తూ తామే బి ఎల్ ఆర్ ను గెలిపించినంత ప్రచారం చేసుకుంటున్నారు కొంతమంది. అలాంటివారు నిజంగా బిఎల్ఆర్ వెంట తిరుగుతున్నారా..? ఇక్కడ జరిగే సమాచారాన్ని మరి ఎవరికైనా చేరవేస్తున్నారా..? అనే అనుమానం బిఎల్ఆర్ మనుషుల్లో ఉంది.

ALSO READ : BREAKING : జిల్లా కలెక్టర్ గన్ మెన్ తన కుటుంబ సభ్యులను కాల్చి.. తాను ఆత్మహత్య..!

ఎందుకు వస్తున్నారో..? ఎందుకు వెళ్తున్నారో..? కూడా అర్థం కాని పరిస్థితి ఉందని బిఎల్ఆర్ వెంట ఉన్న నాయకులు చెప్పుకోవడం గమనార్హం. ఇలాంటివారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకంగా ఉంటారని ఆయన వర్గీయులు భావిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు