మిర్యాలగూడ ఎమ్మెల్యేగా భత్తుల లక్ష్మారెడ్డి ప్రమాణస్వీకారం

మిర్యాలగూడ శాసనసభ్యులుగా భత్తుల లక్ష్మారెడ్డి (బి ఎల్ ఆర్ ) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాదులోని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు.

మిర్యాలగూడ ఎమ్మెల్యేగా భత్తుల లక్ష్మారెడ్డి ప్రమాణస్వీకారం

మిర్యాలగూడ , మన సాక్షి :

మిర్యాలగూడ శాసనసభ్యులుగా భత్తుల లక్ష్మారెడ్డి (బి ఎల్ ఆర్ ) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాదులోని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు.

బత్తుల లక్ష్మారెడ్డి శాసనసభ్యులుగా గెలుపొందిన తర్వాత వైరల్ ఫీవర్ తో బాధపడటం వల్ల ప్రమాణ స్వీకారం ఆలస్యమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డిని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు అభినందించారు.

ALSO READ : BREAKING : జిల్లా కలెక్టర్ గన్ మెన్ తన కుటుంబ సభ్యులను కాల్చి.. తాను ఆత్మహత్య..!

అనంతరం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన భత్తుల లక్ష్మారెడ్డి కి మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొదిల శ్రీనివాస్, సజ్జల రవీందర్ రెడ్డి, ఇజ్రాయిల్, గుండు నరేందర్, చలపతిరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన భత్తుల లక్ష్మారెడ్డి తన సతీమణి భత్తుల మాధవి తోపాటు కుమారులు సాయి ప్రసన్న కుమార్ రెడ్డి , ఈశ్వర్ గణేష్ రెడ్డి లతో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ ను సన్మానించారు.

ALSO READ : ప్రభుత్వ చీఫ్ విప్ లుగా నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు