జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయా కు వెళ్లిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.. ఎందుకంటే..!

ప్రభుత్వ వైద్యాన్ని నమ్ముకుని ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జిల్లా ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పలు వార్డులను తనిఖీ చేశారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయా కు వెళ్లిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.. ఎందుకంటే..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :-

ప్రభుత్వ వైద్యాన్ని నమ్ముకుని ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జిల్లా ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పలు వార్డులను తనిఖీ చేశారు.

ఆర్తో వార్డు ఎన్సిడి క్లినిక్ అసిస్టెంట్ రూమ్ ను తనిఖీ చేశారు. అలాగే స్కానింగ్ ఆరోగ్య మహిళ, ఆరోగ్యశ్రీ సర్జికల్ వార్డులను తనిఖీ చేశారు. జనరల్ వార్డు, ఫార్మసీ స్టోర్, వాక్సినేషన్ రూమ్, మెయిన్ సర్జికల్ స్టోర్ రిజిస్టర్లను పరిశీలించారు.

ALSO READ : Telangana : తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్..!

ఆసుపత్రిలో రోగులకు సకాలంలో గుడ్లు, పాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేటర్నిటీ వార్డు, పిపి యూనిట్ తనిఖీ చేసి హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. అలాగే ఆర్టిపిసిఆర్ ల్యాబ్ తనిఖీ చేసి శాంపుల్ ప్రాసెసింగ్ రూమ్ పరిశీలించారు.

ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్లు ఎంతమంది పనిచేస్తున్నారని సూపరింటెండెంట్ అడిగి తెలుసుకున్నారు. టీ హబ్ నుండి ఎన్ని టెస్టులు చేస్తున్నారని అడిగీ తెలుసుకున్నారు. క్యాజువాలిటీ, ఐసీయూ వార్డులను తనిఖీ చేసి న్యూట్రిషన్ కిట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ALSO READ : Rythu Bandhu : రైతుబంధు డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి..!

అనంతరం చిల్డ్రన్ హాస్పిటల్లోని ఓ. పి.వార్డులను డయాలసిస్ యూనిట్ను ఐసీయూ  విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని సూపరింటెండెంట్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రంజిత్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.