BREAKING : తెలంగాణలో కరోనా కేసులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

తెలంగాణలో కరోనా మళ్లీ మొదలైంది. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకు వైద్య ఆరోగ్యశాఖ కీలకమైన సూచన చేసింది. రెండు సంవత్సరాలుగా కరోనా ఊసేలేని తెలంగాణ.. ఇప్పుడు మళ్లీ కరోనా బారిన పడే అవకాశం ఉంది.

BREAKING : తెలంగాణలో కరోనా కేసులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
హైదరాబాద్, మన సాక్షి :
తెలంగాణలో కరోనా మళ్లీ మొదలైంది. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకు వైద్య ఆరోగ్యశాఖ కీలకమైన సూచన చేసింది. రెండు సంవత్సరాలుగా కరోనా ఊసేలేని తెలంగాణ.. ఇప్పుడు మళ్లీ కరోనా బారిన పడే అవకాశం ఉంది. ప్రభుత్వం నిన్నటి నుంచి కరోనా పాజిటివ్ కేసుల బులిటెన్ విడుదల చేస్తోంది.

తాజాగా నాలుగు కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న 402 టెస్టులు చేయగా వాటిలో నాలుగు పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం తొమ్మిది మంది కరోనా ఐసోలేషన్లో ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.

ALSO READ : Gas cylinder : తెలంగాణలో గ్యాస్ సిలిండర్ రూ. 500 లకే.. ఆ రోజు నుంచే అమలు..!

కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించకపోతే ఫైన్ విధిస్తామని హెచ్చరించింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు 142 నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త వేరియంట్ జేఎన్ – వన్ తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కరోనా మూడు వేవ్ లతో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలు ఈసారి ముందస్తుగానే జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ALSO READ : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయా కు వెళ్లిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.. ఎందుకంటే..!

తాజాగా కేరళలో మరో కొత్త వేరియంట్ ఉప జాతి రకం కరోనా సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుత శీతాకాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డబ్బు ఆదేశాలు జారీచేసింది.