BRS, BSP : తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై మాయావతి సంచలన ప్రకటన.. ఆర్ఎస్పి ట్వీట్..!
BRS, BSP : తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై మాయావతి సంచలన ప్రకటన.. ఆర్ఎస్పి ట్వీట్..!
హైదరాబాద్ , మన సాక్షి :
తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు విషయంపై ఆ పార్టీ అధినేత్రి మాయావతి సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆమె ప్రకటనను తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన సమాచారం యధావిధిగా. …
తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త!
బీయస్పీ – బీఆరెస్ ల కూటమి చర్చలపై నిన్న ఏర్పడిన సందిగ్దానికి బీయస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి గారు కొద్ది సేపటి క్రితమే తెరదించారు. ప్రస్తుతం బీఆరెస్ పార్టీ దేశంలో ఏ కూటమి లో లేనందున, బీయస్పీకి ఆ పార్టీతో పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కలసి పనిచేయడానికి బెహన్జీ గారు అనుమతించారని బీయస్పీ హై కమాండ్ తెలిపింది.
త్వరలోనే పొత్తు విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సమక్షంలో జరిగే తదుపరి చర్చలకు బీయస్పీ యం పీ, కేంద్ర సమన్వయకర్త, శ్రీ రాంజీ గారు బెహన్జీ దూతగా హాజరు కానున్నారు.
తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త!
బీయస్పీ – బీఆరెస్ ల కూటమి చర్చలపై నిన్న ఏర్పడిన సందిగ్దానికి బీయస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి గారు కొద్ది సేపటి క్రితమే తెరదించారు. ప్రస్తుతం బీఆరెస్ పార్టీ దేశంలో ఏ కూటమి లో లేనందున, బీయస్పీకి ఆ పార్టీతో పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో…— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 10, 2024









