Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : బైక్ పై నుంచి కిందపడి దుర్మరణం..!

Nalgonda : బైక్ పై నుంచి కిందపడి దుర్మరణం..!

కనగల్, మన సాక్షి:

నల్గొండ జిల్లా మండలంలోని జి.యడవల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కనగల్ ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… చండూరు మండలం దోనిపాములకు చెందిన ఆలేటి అశోక్ (21) తన బైక్ పై హాలియా నుండి స్వగ్రామం వెళుతుండగా మార్గమధ్యలోని జి. యడవల్లి వద్ద అతివేగంతో అదుపుతప్పి బైకు పైనుంచి కింద పడడంతో అశోక్ తలకు తీవ్రగాయాలయ్యాయి.

బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించగా క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో గురువారం ఉదయం అశోక్ మృతి చెందాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ALSO READ : BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు