Good News : ఇసుక రవాణా పై ప్రభుత్వం గుడ్ న్యూస్..!
Good News : ఇసుక రవాణా పై ప్రభుత్వం గుడ్ న్యూస్..!
మన సాక్షి , వెబ్ డిస్క్ :
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక రవాణా పై ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఉచితంగా ఇసుక అందిస్తామని తెలియజేసింది. వివిధ గ్రామాల నుంచి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణాలకు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణా చేసుకోవడానికి అనుమతి వాళ్ళంటూ ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. దాంతో గ్రామాల్లో నిర్మాణాలకు ఉచితంగా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు గ్రామాల సమీపంలోని వాగుల నుంచి ఇసుకను రవాణా చేసుకోవడానికి అనుమతి ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అవసరం ఉన్నవారు ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతి ఇస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం గుర్తించిన రీచ్ ల నుండి ఉచితంగా ఈ ఇసుకను అందించనున్నారు. సరైన పత్రాలు చూపించిన వారికి స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
MOST READ :
Liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటివరకు అరెస్టులు ఎన్నో తెలిస్తే షాక్..!
BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
Telangana : మీ కరెంట్ బిల్లు జీరో రాలేదా..? అయితే ఇలా చేయండి..!
Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!
Telangana : తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి శుభవార్త.. మరో మూడు గ్యారెంటీల అమలు..!









