Daasi : ప్రముఖ చిత్రకారుడు, నంది అవార్డు గ్రహీత దాసి సుదర్శన్ మృతి..!
Daasi : ప్రముఖ చిత్రకారుడు, నంది అవార్డు గ్రహీత దాసి సుదర్శన్ మృతి..!
నాగార్జునసాగర్, మన సాక్షి :
దాసి సుదర్శన్ గా పిలువబడే సీనియర్ పాత్రికేయులు ప్రముఖ చిత్రకారుడు జాతీయ నంది అవార్డు గ్రహీత సుదర్శన్ (72) సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మిర్యాలగూడలో పరమపదించారు .
ప్రముఖ చిత్రకారుడు గా, సాహితీవేత్తగా సురపరిచితులైన సుదర్శన్ నాగార్జునసాగర్ జూనియర్ కాలేజ్ లో డ్రాయింగ్ మాస్టర్ గా పనిచేస్తూ, ఎంతోమంది విద్యార్థులను కళల వైపు, సాహిత్యం వైపు మళ్లించి నుంచి నిష్ణాతులను చేశారు. ఆర్టిస్టుగా, సాహితీవేత్తగానే కాకుండానే కాకుండా ఆయన జర్నలిస్టుగా కూడా వివిధ పత్రిక ల్లో వ్యాసాలు, వార్తలు రాస్తూ ప్రజ్ఞ పాటవాలను నిరంతరం ప్రకటిస్తుండేవారు.
ఆయన వివిధ ప్రజ్ఞ పాటవాలతో సినిమా రంగానికి కూడా ఆయన సులపరిచితులే. ప్రముఖ దర్శకులు కళాకారులు బి నర్సింగరావు తీసిన అనేక సినిమాలకు ఆయన కళాదర్శకుడిగా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు . నర్సింగరావు తీసిన దాసి సినిమాకు అందుకున్న ఐదు జాతీయ అవార్డులలో సుదర్శన్ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత జాతీయ అవార్డులు జ్యూరీ సభ్యులుగా నియమితులయ్యారు.
ఇలా అనేక రంగాలలో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన సుదర్శన్ తన 72 ఏటా తనువు చాలించారు ఆయన అభిమానులకు ,శిష్యులకి ,మిగతా సాహితి మిత్రులందరికీ తట్టుకోలేనితన బాధను మిగిల్చి వెళ్లిపోయారు. నాగార్జునసాగర్లో నివాసము ఉన్న గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో హైదరాబాద్ , మిర్యాలగూడలో ఉంటూ సోమవారం మిర్యాలగూడలో గుండెపోటుతో మృతి చెందడంతో సాగర్ లోని ఆయన అభిమానులు,, కళాకారులు, జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు.
ALSO READ :
Additional Dowry : అదనపు కట్నం కోసం భర్త అత్త వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య..!
BREAKING : రేవంత్ తో కేకే భేటీ.. చనిపోయే వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని కేకే ప్రకటన..!
KCR : ఫాఫం కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడు నెలల ముచ్చటగా కారు పార్టీ కథ..!









