Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

BIG BREAKING : నడుస్తున్న కారులో మంటలు..!

BIG BREAKING : నడుస్తున్న కారులో మంటలు..!

ముస్లాపూర్‌ వద్ద హైవేపై కాలి బుడిదైన కారు

అందోలు, మనసాక్షిః

నడుస్తున్న కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్దమైన ఘటన ఆదివారం అల్లాదుర్గ్‌ మండలం ముస్లాపూర్‌ వద్ద నాందేడ్‌ అకోలా–161 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. టిఎస్‌ 11 ఈడి 5325 అనే నెంబరు గల కారు హైద్రాబాద్‌ నుంచి నారాయణఖేడ్‌ వైపు వెళుతుండగా, ముస్లాపూర్‌ శివారులోకి రాగానే ఒక్కసారిగా కారులో నుంచి మంటలు వచ్చాయి. డ్రైవర్‌ అప్రమత్తమై కారు నిలిపి అందులో ప్రయాణిస్తున్న వారిని వెంటనే కిందికి దింపడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

ప్రాణ నష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా యువకులే కాగా, వారంతా సంపంగి అని ప్రింట్‌ చేసి డ్రెస్‌కోడ్‌ను ధరించి ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. వేసవి కాలం దృష్ట్యా కారులోని వైర్లు ఒ్దనికొకటి అంటుకొని షార్ట్‌ స్క్యూట్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానకులు భావిస్తున్నారు.

ఏదైనా ప్రమాదం జరిగితే ఇంజన్‌ భాగం నుండి లేదా, డిజీల్‌/పెట్రోల్‌ ట్యాంకు వద్ద నుంచి మంటలు వస్తాయి. కానీ ఒకేసారి నలువైపుల నుంచి మంటలు రావడంతో స్థానికులు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వరకు కూడా కారు కాలిపోయిన సంఘటన గూర్చి ఎక్కడా ఫిర్యాదు చేయలేదని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికిని ఉమ్మడి జిల్లాలో ఈ సంఘటన సంచలనం కలిగించింది.

ALSO READ : 

WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?

Cm Revanth : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. 9వ తేదీ వరకు వారి ఎకౌంట్లకు డబ్బులు..!

Watermelons : పుచ్చకాయల్లోకి రంగు ఎలా నింపుతున్నారో తెలిస్తే షాక్.. అందరూ చూడాల్సిందే.. (వీడియో వైరల్)

మరిన్ని వార్తలు