సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ..!
సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ..!
రాజన్న సిరిసిల్ల జిల్లా, మన సాక్షి :
తండ్రి మరణ వార్త విని గుండె పోటుకు గురై కుప్పకూలిన సిరిసిల్ల పట్టణ గాంధీ నగర్ కు చెందిన చిలగాని అనూహ్య కు తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గడ్డమీది శ్రీనివాస్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
ఇంట్లో నుండి కేకలు వినబడంతో అక్కడ ఏం జరిగిందో ఇంట్లో వాళ్ళు గమనించే లోపే అక్కడ ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆమెకు గుండె పోటు వచ్చినట్టు గుర్తించి వెంటనే సీపీఆర్ చేసి సమీపంలోని ఆసుపత్రికి తన సొంత వాహనంలో తరలించారు.
కానిస్టేబుల్ చాకాచక్యంతో ఆమె ప్రాణాలతో బయటపడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ను ఎస్పీ అఖిల్ మహాజన్, పలువురు నేటిజన్లు అభినందించారు.
ALSO READ :
BREAKING : మిర్యాలగూడ, శాలిగౌరారంలలో పెద్దఎత్తున నకిలీ పత్తి విత్తనాల పట్టివేత..!









