Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

TDP : టిడిపి నేతల సంబరాలు..!

TDP : టిడిపి నేతల సంబరాలు..!

మదనపల్లి, మన సాక్షి:

జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టిడిపి నాయకులు కురబలకోట మండలంలో సంబరాలు జరుపుకున్నారు.

కురబలకోటలో టిడిపి నాయకులు కొమ్మద్ది ఖలీల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి. మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కురబలకోటలో ప్రదర్శన నిర్వహించారు. దొమ్మన్న బావి వద్ద మదనపల్లి మండల మాజీ జడ్పిటిసి, టిడిపి నాయకులు నాదేళ్ల ద్వారకనాథ్ పార్టీ పతాకాన్ని ఎగరవేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు.

ఆయన అనుభవం రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం బాగుపడాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. నాయకులు సంబరాలు జరుపుకొని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గాలేటి వెంకటరెడ్డి, కామకోటి ప్రసాద రావు, చిన్న రాజా, జంగా ఎల్లారెడ్డి, జంగా రాఘవరెడ్డి, తుమ్మచెట్లపల్లి సురేంద్ర, శివ నారాయణ, గోపాలకృష్ణ, ప్రదీప్, అంగళ్లు తోట అశోక్, జంగా వారిపల్లి బాలు, నరేంద్ర, వేణు, మల్లికార్జున, మహిళా నాయకురాలు తుమ్మచెట్లపల్లి నాగరత్న తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Chandrababu : నారా చంద్రబాబు నాయుడు అనే నేను..!

Revanth : రేవంత్ రెడ్డి తర్వాత ఎవరు? ఏఐసీసీ కసరత్తు..!

Sharmila : జగన్ ను వదలని సోదరి షర్మిల.. మళ్లీ గేమ్ స్టార్ట్..!

 

మరిన్ని వార్తలు