Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Ponguleti : రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లపై పొంగులేటి కీలక ప్రకటన..!

Ponguleti : రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లపై పొంగులేటి కీలక ప్రకటన..!

నేలకొండపల్లి, మన సాక్షి:

రైతుల రుణ మాఫీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లాలో పర్యటన సందర్భంగా ఆయన వివరాలను వెల్లడించారు. వచ్చే నెలలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీ అమలు చేయనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనవాసరెడ్డి అన్నారు. మండలం లోని వివిధ గ్రామాలలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో ఆయన మాట్లాడారు…కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని అన్నారు.

హమీలలో భాగంగా రుణమాఫీ ని వచ్చే నెలలో రూ.31 కోట్లతో అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. రుణమాఫీ ని ప్రతిపక్షాలు తట్టుకోలేక నోరుజారుతున్నారని అన్నారు. పేదలకు ఇచ్చిన హమీలను అమలు చేయటంలో వెనక్కి తగ్గేది లేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అన్నింటిని విడతల వారీగా నెరవేర్చేందుకు ప్రభుత్వం . చితశుద్ధి ఉందని అన్నారు.

ఇందిరము ఇళ్లు పేదవాళలో అతి పేదవాళ`’కుముందు మంజూరు చేస్తామని అన్నారు. లిప్టు రిపేరు చేయించి రైతులకు సాగు నీటిని ఇబ్బందులు లేకుండా చేస్తామని అన్నారు. వివిధ గ్రామాలలో వినతి ప్రతాలను స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మోటాపురంలో మంత్రిని రావెళ్ల కృష్ణారావు గజమాలతో ఘనంగా సన్మానించారు. మండలంలో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించారు.

ఆయన వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మేల్సీబాలసాని లక్ష్మినారాయణ, ఎంపీపీ వజ్జా రమ్య, స్థానిక నాయకులు శాఖమూరి రమేష్, వి.సీతారాములు, కోడాలి గోవిందరావు, బొందయ్య, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, రావెళ్ల కృష్ణారావు, గుడిమళ్ల మధు, పెంటమళ్ల పుల్లమ్మ, పాకనాటి కన్నారెడ్డి, కడియాల నరేష్, కొచ్చేర్ల శ్రీనివాసరావు, వెంకన్న, లక్ష్మినారాయణ, పి.మాధవి, మేకల వెంకటేశ్వర్లు, కొమ్మినేని విజయ్.. మారుతి కోటి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Free Coaching : సివిల్స్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ.. డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం..!

Miryalaguda: రైస్ మిల్లుల్లో పొల్యూషన్ అధికారుల తనిఖీలు..!

Jobs : పదవ తరగతి మార్కులతో ఉద్యోగాలు.. మీరూ దరఖాస్తు చేసుకోండి..!

మరిన్ని వార్తలు