Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING: నల్గొండ జిల్లాలో లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు.. కేసులు నమోదు..!

BREAKING: నల్గొండ జిల్లాలో లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు.. కేసులు నమోదు..!

దేవరకొండ , మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో ని పలు కిరాణా షాపుల పై లీగల్ మెట్రాలజీ శాఖ తనిఖీలు కిరాణా షాపులపై ఫిర్యాదు నేపథ్యంలో లీగల్ మెట్రాలజీ శాఖ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి పి రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం పలు కిరాణా షాపు లపై తనిఖీలు నిర్వహించింది.

ముఖ్యంగా పద్మ కిరాణం అండ్ జనరల్ స్టోర్స్, జాహ్నవి ట్రేడర్స్, ఎస్ ఎల్ ఎన్ స్వామి కిరాణం, ధనలక్ష్మి ట్రేడర్స్ అండ్ కో, గోపికృష్ణ కిరాణం, అంజలి సూపర్ మార్కెట్, నాళ్ల పెద్ద మారయ్య కిరాణం, లక్ష్మీ గణపతి కిరాణం మరియు సాయి లక్ష్మీ కిరాణం ల లో ప్యాకేజీలపై మ్యాను ఫ్యాక్చరింగ్ అడ్రస్, ఎమ్మార్పీ, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, కస్టమర్ కేర్ నెంబర్ ఈమెయిల్ ఐడి అడ్రస్ వంటి వివరాలు ముద్రించబడి లేకపోవడంతో వారిపై తొమ్మిది(9) కేసులు నమోదు చేసి రూ. 1,80 లక్షల జరిమానా విధించడం జరిగింది.

కిరాణం దుకాణంలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

ఈ సందర్భంగా వ్యాపారస్తులు తమ దుకాణాలలో డిక్లరేషన్ లేని ప్యాకేజీలు అమ్మరాదని అటువంటివి తనిఖీలలో దొరికినట్లయితే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ప్యాకింగ్ చేసేవారు విధిగా ప్యాకింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.

వేయింగ్ మిషన్స్ వాడేవారు వెరిఫికేషన్ సర్టిఫికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తూకంలో తేడా లేకుండా వ్యాపారం చేయాలని లేనిచో వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు వినియోగదారులు కోరినట్లయితే వారికి తమ యొక్క వేయింగ్ మిషన్ కరెక్ట్ గా ఉందా లేదా అనే విషయాన్ని ఒకటి నుండి ఐదు కేజీల వరకు ఏదైనా బాటు పెట్టి చూపించాల్సి ఉంటుంది.

ఈ సందర్భంగా వినియోగదారులు వారికి ఎటువంటి కంప్లైంట్ ఉన్న లీగల్ మెట్రోలజీ శాఖ కార్యాలయం ను సంప్రదించవచ్చని లేదా వాట్సాప్ ద్వారా ఫోన్ నెంబర్ 9010651783 కు కంప్లైంట్ నమోదు చేసుకోవచ్చు అని తెలిపారు.

ALSO READ: 

BREAKING : జిల్లా కలెక్టర్ ఉత్తర్వులపై మండిపడ్డ వైద్యులు, సిబ్బంది నిరసన.. సందర్శించిన అదనపు కలెక్టర్..!

WhatsApp : ఆ 35 ఫోన్లకు వాట్సప్ సేవలు బంద్.. జాబితాలో మీ ఫోన్ ఉందా.. చూసుకోండి..!

Cm Revanth Reddy: నన్ను తప్పించండి.. సోనియా, రాహుల్ గాంధీలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..!

మరిన్ని వార్తలు