Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయంటెక్నాలజీ

WhatsApp : కొత్త టెక్నాలజీ పై ఫోకస్ పెట్టిన వాట్సప్.. మరో రెండు కొత్త ఫీచర్లు..!

WhatsApp : కొత్త టెక్నాలజీ పై ఫోకస్ పెట్టిన వాట్సప్.. మరో రెండు కొత్త ఫీచర్లు..!

WhatsApp : వాట్సప్ కొత్త టెక్నాలజీ పై దృష్టి పెట్టింది. వినియోగదారులకు ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చి వాట్సాప్ ను మరింత ఎక్కువమంది ఉపయోగించే విధంగా చేస్తుంది. మెసేజింగ్ యాప్ లలో ఎక్కువమంది ఉపయోగించేది వాట్సప్. ప్రపంచంలోనే కోట్లాదిమంది వాట్సాప్ ను వినియోపిస్తున్నారు.

ఇటీవల కాలంలో మెటా ఏఐ టెక్నాలజీ కొత్తగా తీసుకువచ్చింది. అయితే ఇది చాట్ బాట్ ఫీచర్. దీంతో యూజర్లు ఏది అడిగినా క్షణాల్లో చెప్పేస్తుంది. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంది. దీనిపై పాజిటివ్ టాక్ కూడా వినిపిస్తుంది. అంతలోనే మరో రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ సిద్ధమైంది. వాట్సాప్ యాప్ తో వాయిస్ నోట్స్, వీడియో నోట్స్ అనే ఫీచర్లు తీసుకురానున్నది.

వాయిస్ నోట్స్ :

కొత్తగా వాయిస్ నోట్ ఫీచర్ తో వాట్సాప్ చాట్ విండో ద్వారా తమ కాంటాక్ట్లకు వాయిస్ నోట్స్ ను పంపవచ్చును. ఈ ఫీచర్ ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులో ఉన్న వాయిస్ నోటిఫికేషన్ పోలి ఉంటుంది. ఈ ఫీచర్ తో కమ్యూనికేషన్ ఈజీ చేయడానికి ఉపయోగించబడుతుంది.

ALSO READ : WhatsApp : ఆ 35 ఫోన్లకు వాట్సప్ సేవలు బంద్.. జాబితాలో మీ ఫోన్ ఉందా.. చూసుకోండి..!

వీడియో నోట్స్ :

కాంటాక్ట్ లకు వాయిస్ నోట్స్ తో పాటు వీడియో నోట్స్ ను కూడా పంపే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2..24.14.14 లో అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం బీట టెస్టింగ్ స్టేజ్ లో ఉంది. వీడియో నోట్ ఫీచర్ చిన్న వీడియో క్లిప్ లను పంపడానికి ఉపయోగపడుతుంది. వీడియో నోట్ ద్వారా తీసిన వీడియో క్లిప్ గ్రూపులో ఇండివిజువల్ గా కాంటాక్ట్ లో కూడా పంపవచ్చును.

ALSO READ : 

BREAKING : పనిచేసే వారికి నేనెప్పుడూ అండగా ఉంటా, ఎట్టి పరిస్థితుల్లో తప్పులకు ఆస్కారం ఉండొద్దు. ఆ జిల్లా కలెక్టర్ స్పష్టం..!

Telangana : వెలవెలబోతున్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు.. ఏ ప్రాజెక్టులో ఎంత నీరు నీరుంది, ఎదురుచూస్తున్న రైతులు..!

మరిన్ని వార్తలు