Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణసంక్షేమంహైదరాబాద్

Good News : తెలంగాణ సర్కార్ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఈ పథకానికి లక్షల్లో ఆర్థిక సహాయం..!

Good News : తెలంగాణ సర్కార్ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఈ పథకానికి లక్షల్లో ఆర్థిక సహాయం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల అమలుకు కృషి చేస్తున్నారు. ఒక్కొక్కటి వరుసగా అమలు చేస్తూ వస్తున్నారు. గ్యారెంటీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే కొన్ని గ్యారెంటీ పథకాలు కూడా ప్రారంభమయ్యాయి.

ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని చెప్పవచ్చును. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఈ పథకం కొనసాగుతుండగానే మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలియజేసింది.

తెలంగాణ రాష్ట్రంలో మహిళ స్వయం సహాయక సంఘాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ శుభవార్తను తెలియజేశారు. మహిళా శక్తి పథకం కింద మహిళలకు పాడి పశువులు, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, దేశవాలి కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని నిర్ణయించింది.

వీటి నిర్వహణకు బ్యాంకులు, మండల మహిళ సమాఖ్య, శ్రీనిధి ద్వారా రుణాలు అందజేయాలని ప్రకటించింది. జిల్లాల వారీగా మహిళా సంఘాలలో అర్హులైన వారిని ఎంపిక చేసే బాధ్యత జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కల్పించింది. మహిళ స్వయం సహాయక సంఘాలకు వీటి ఏర్పాటుకు గాను బ్యాంకులు, శ్రీనిధి ద్వారా వారికి ఏర్పాటుకు అయ్యే లక్షల రూపాయలను రుణాలు అందజేయనున్నారు. ఈ పథకం అమలు అయితే ప్రతి గ్రామంలో మహిళలు స్వయం శక్తితో ఎదిగే అవకాశం ఉంది.

ఇప్పటికే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయి. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు నెలకు ₹2500 సహాయంను త్వరలో అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుంది. రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తయిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు.

ALSO READ : 

Ration Cards : మీ రేషన్ కార్డులో పేర్ల తప్పులు, కొత్త పేర్లు యాడ్ చేయడం.. అడ్రస్ చేంజ్.. లేటెస్ట్ అప్డేట్స్..!

బాలెంల డిగ్రీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ గదిలో లభ్యమైన బీరు సీసాలు..!

GreenTea : గ్రీన్ టీ తాగడం వల్ల ఇన్ని లాభాలా.. అవేంటో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు