బాలెంల డిగ్రీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ గదిలో లభ్యమైన బీరు సీసాలు..!

సూర్యాపేట మండలం బాలెంల గ్రామ శివారులో గల సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శారద విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తిస్తూ, బూతులు తిడుతున్నారని, మద్యం సేవించి విధులకు హాజరు అవుతున్నారని, ప్రిన్సిపాల్ ను వెంటనే తొలగించి నూతన ప్రిన్సిపాల్ ను నియమించాలని డిమాండ్ చేస్తూ కళాశాల విద్యార్థినులు కళశాల ముందు శనివారం ధర్నా నిర్వహించారు.

బాలెంల డిగ్రీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ గదిలో లభ్యమైన బీరు సీసాలు..!

సూర్యాపేట రూరల్, మనసాక్షి

సూర్యాపేట మండలం బాలెంల గ్రామ శివారులో గల సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శారద విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తిస్తూ, బూతులు తిడుతున్నారని, మద్యం సేవించి విధులకు హాజరు అవుతున్నారని, ప్రిన్సిపాల్ ను వెంటనే తొలగించి నూతన ప్రిన్సిపాల్ ను నియమించాలని డిమాండ్ చేస్తూ కళాశాల విద్యార్థినులు కళశాల ముందు శనివారం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మీడియా తో మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపాల్ శైలజను తక్షణమే విదుల నుండి తొలగించి నూతన ప్రిన్సిపాల్ ను నియమించాలని అన్నారు. ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ తమకు వద్దని శాశ్వత ప్రిన్సిపాల్ ను నియమించాలని వారు డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ కుమారుడు కాలేజ్ కి వచ్చినప్పుడు క్యాంపస్ లో వారం రోజుల పాటు వుంటాడని, తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్ వొసి అరుణ మాట్లాడుతూ కళాశాలలో జరుగుతున్న సంఘటనలపై పై అధిలారులకు నివేదన పంపించామని, త్వరలోనే ముగ్గురు సభ్యుల కమిటీ కళాశాలకు వచ్చి విచారణ చేపడతారని అన్నారు. ప్రస్తుత ప్రిన్సిపాల్ ను భాధ్యతల నుండి తప్పించామని, నూతన ప్రిన్సిపాల్ నియామకం జరిగే వరకు వైస్ ప్రిన్సిపాల్ ఇంఛార్జ్ గా వ్యవహరిస్తారని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపాల్ గదిలోని బీరువాలో బీరు సీసాలను విద్యార్థినులు బయటకు తీశారు. కళాశాలను సూర్యాపేట ఆర్డివొ వేణుమాధవ్ మరియు డిఎస్పి రవి సందర్శించి విద్యార్దినులతో మాట్లాడి వారికి ధైర్యంగా వుండాలని, ప్రభుత్వ పరంగా చర్యలు చేపడతామని తెలిపారు.

ALSO READ : 

BREAKING : నల్గొండలో వైన్స్, హోటళ్లపై ఫుడ్ ఇన్స్ పెక్టర్ దాడులు..!

Miryalaguda : మీకు తోడుగా నేనుంటా కానీ.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ వారికి డెడ్ లైన్..!