Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : నల్గొండలో వైన్స్, హోటళ్లపై ఫుడ్ ఇన్స్ పెక్టర్ దాడులు..!

BREAKING : నల్గొండలో వైన్స్, హోటళ్లపై ఫుడ్ ఇన్స్ పెక్టర్ దాడులు..!

నల్లగొండ , మనసాక్షి :

నల్గొండ పట్టణంలోని పలు వైన్స్ వైన్ షాపుల మీద మరియు హోటల్స్ పై, జోనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి నల్గొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి స్వాతి తో కలిసి శనివారం ఆకస్మిక దాడులు జరిపారు. వైన్ షాప్ యజమానుదారులు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ ఎస్ ఎస్ ఏ లైసెన్స్ అనుమతులు లేకుండా విక్రయాలు జరుగుతున్నందున నోటీసులు ఇవ్వడం జరిగిందని ఫుడ్ సేఫ్టీ అధికారి జ్యోతిర్మయి తెలిపారు.

వాళ్లు అమ్మే ఆల్కహాల్ కూడా ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టంలోకు అనుకూలంగా లేవని అనుమానించి వివిధ రకాల ఆల్కహాల్ శాంపుల్స్ ని సేకరించడం జరిగిందని. శాంపుల్స్ నివేదికల ఆధారంగా వారి మీద తీవ్రతను బట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడం జరిగింది.

అలాగే కల్తీ మద్యం గాని, మద్యం ను మిస్ బ్రాండింగ్ చేసి అమ్మినట్లయితే కూడా చట్టపరమైనటువంటి కేసులు శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే ప్రతి వైన్స్ వ్యాపారదారుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు తప్పనిసరిగా పొందాలని లేనియెడల ఐదు లక్షల జరిమానాలతో పాటు ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు.

ALSO READ : 

TGEAPSET : తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన షురూ.. ఇవి ఉన్నాయేమో సరిచూసుకోండి..!

Electricity Bill : మీ కరెంట్ బిల్లు ఈజీగా ఇలా చెల్లించండి.. మొబైల్ తోనే చెల్లించవచ్చు..!

మరిన్ని వార్తలు