Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్తెలంగాణరాజకీయంహైదరాబాద్

Ktr, Somireddy : మీ కళ్ళకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది.. కేటీఆర్ పై సోమిరెడ్డి ఫైర్..! 

Ktr, Somireddy : మీ కళ్ళకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది.. కేటీఆర్ పై సోమిరెడ్డి ఫైర్..! 

మన సాక్షి :

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఆయన ట్విట్టర్ లో స్పందించిన తీరు ఘాటుగా ఉంది.

పాలనలో తండ్రి ఫామ్ హౌస్ కు, కొడుకు కలెక్షన్ హౌస్ కు పరిమితమయ్యారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా, మీ సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా మీలో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో మీ కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది.

ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకున్నారు. జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో ఐదేళ్లు నలిగిపోవాలని ఆశించారు. అందుకే మీకు తెలంగాణ ప్రజలు ముందుగానే గుణపాఠం చెప్పారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే మీ కొంప ముంచిందని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి : 

Komatireddy Venkatreddy : సౌకర్యం కోసం ట్రామా కేర్ సెంటర్లు.. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి..!

KTR : మీకు అన్నగా ప్రచారం చేసుకుంటున్న సుధీర్ రెడ్డి.. అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ట్వీట్..!

 

మరిన్ని వార్తలు