Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newstravelజిల్లా వార్తలుతెలంగాణనల్గొండహైదరాబాద్

Komatireddy Venkatreddy : సౌకర్యం కోసం ట్రామా కేర్ సెంటర్లు.. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి..!

Komatireddy Venkatreddy : సౌకర్యం కోసం ట్రామా కేర్ సెంటర్లు.. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి..!

నకిరేకల్, మనసాక్షి:

జాతీయ రహదారి పైన ప్రయాణించే వారికి ప్రమాదం జరిగినప్పుడు మెరుగైన వైద్యం అందించేందుకే ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆర్ అండ్ బి,సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం కేతేపల్లి మండలం కొర్లపాహడ్ టోల్ వద్ద నూతనంగా నిర్మించనున్న ట్రామ కేర్ సెంటర్ కు భూమి పూజ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్ &బి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎం పి చామల కిరణ్ కుమార్ రెడ్డి లు చేశారు.

ఈ సందర్బంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఐదు కోట్ల నిధులతో నిర్మించనున్న ట్రామ కేర్ సెంటర్ కు నిధులు అందిస్తున్న ఏ డి పి సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు. రెండు నెలల్లో ట్రామ కేర్ సెంటర్ ను ప్రారంభించుకుంద్దాం అన్నారు. 2009 లో హైదరాబాద్ , విజయవాడ హైవే నాలుగు లైన్ల రోడ్డును నిర్మాణం చేశామన్నారు. ఇదే హైవే ని ఈ సెప్టెంబర్ లో ఎక్స్ ప్రెస్ హైవేగా నిర్మాణం చెసేందుకు పనులు చేపట్టానున్నట్లు చెప్పారు.

ALSO READ : BREAKING : ఇంటింటా ఇన్నోవేటర్, ఆ తేదీలోగా వివరాలు పంపాలి.. జిల్లా కలెక్టర్..!

త్వరలో బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ప్రారంభించి ఈ ప్రాంత ప్రజలకు మూసి నీరు ను అందిస్తామన్నారు. ఆగస్టు 15 లోగా రైతులకు 2 లక్షల రుణం మాఫీ చేస్తామని, రెండు రాజధానిలను కలిపే నల్లగొండ జిల్లాని అన్నీ విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నేషనల్ హైవే 70 కిలోమీటర్లు ప్రయాణం నకిరేకల్ నియోజకవర్గంలోనే ఉందినీ ఏదైన ప్రమాదం జరిగే తక్షణమే చికిత్స అందించే విధంగా ఈ ట్రామ కేర్ సెంటర్ ను ప్రారంభించడం జరుగుతుందిచెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ సూర్యాపేట ఎస్పి సన్ ప్రీత్ సింగ్, ఆర్ &బి సెక్రటరీ దాసరి హరిచందన, తెలంగాణ రాష్ట్ర తొలి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ , బిసి ఫైనాన్స్ కార్పొరేషన మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య , డి సి ఎం ఎస్ చైర్మన్ బొల్లా వెంకట్ రెడ్డి ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

KTR : మీకు అన్నగా ప్రచారం చేసుకుంటున్న సుధీర్ రెడ్డి.. అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ట్వీట్..!

Good News : తెలంగాణ సర్కార్ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఈ పథకానికి లక్షల్లో ఆర్థిక సహాయం..!

మరిన్ని వార్తలు