Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవైద్యం

BREAKING : PHCని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్..!

BREAKING : PHCని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్..!

నల్లగొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లా హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా గైరాజరైన ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ ఎస్ సురేందర్ ను సస్పెండ్ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు.  వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో ముఖాముఖి మాట్లాడి ఆసుపత్రి సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

సబ్ సెంటర్ల ఔట్ పేషెంట్ ల వివరాలు కనుక్కున్నారు.
ఈ రోజు వరకు ఎంత మంది గర్భిణీ స్త్రీలు నమోదయ్యారని సబ్ సెంటర్ల వారిగా ఇంఛార్జీలను అడిగ తెలుసుకున్నారు.
ఎన్ని ప్రసవాలు చేశారని ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ప్రసవాలు, ప్రయివేటు ఆసుపత్రులలో జరిగిన ప్రసవాలపై సమీక్షించారు గర్భిణీ స్త్రీలందరిని నమోదు చేయాలి అని ఆదేశించారు.

గ్రామ స్థాయిలో మంచి వైద్య సేవలందిస్తే ప్రజల మనసుల్లో గుర్తుండి పోతారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజల్లో నమ్మకం పెంచండని కోరారు.  మాతా శిశు సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అంగన్ వాడి కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను పరిశీలించాలనీ ప్రత్యేకించి చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఇస్తున్న ఆహారం, ఐరన్ మాత్రలు అందుతున్నది.. లేనిది పరిశీలించాలన్నారు.

సీజనల్ వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉన్నందున అన్ని గ్రామాలు తిరగాలని ఆదేశించారు.  ఆశ వర్కర్లు, అంగన్ వాడి కార్యకర్తలకు మాత శిశు సంరక్షణ పై పూర్తి అవగాహన ఉండాలి అన్నారు. బర్త్ ప్లాన్ పై కూడా అవగాహన కలిగి ఉండాలి అన్నారు.

ఇవి కూడా చదవండి : 

శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు.. తుంగభద్రకు భారీగా వరద, విద్యుత్ ఉత్పత్తితో సాగర్ కు నీటి విడుదల..!

కృష్ణమ్మ పరవళ్ళు.. తెరుచుకున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు.. త్వరలో శ్రీశైలం, సాగర్ కు వరద..!

మరిన్ని వార్తలు