Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండరాజకీయం

MIRYALAGUDA : మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ సంచలన ప్రకటన.. ఆగస్టు 15 వరకే వారికి అవకాశం..!

MIRYALAGUDA : మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ సంచలన ప్రకటన.. ఆగస్టు 15 వరకే వారికి అవకాశం..!

మిర్యాలగూడ , మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యావరణ పరిరక్షణ కోసం , కాలుష్య నియంత్రణ చేయాలని,యాదద్రి థర్మల్ పవర్ స్టేషన్ ప్రారంభం అయ్యాక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగే అవకాశం ఉన్నందున.. భవిష్యత్తులో మిర్యాలగూడ నియోజకవర్గంలో వేసవికాలం లో ఉష్ణోగ్రతలు తగ్గించాలని, అదే విధంగా పర్యావరణం కాపాడుకోవాలి అని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా *మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వేల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. నాటిన ప్రతి మొక్క సంరక్షణ బాధ్యత కూడా మిల్లర్స్ వారే చూసుకోవడం జరుగుతుందని, అలాగే నాటిన ప్రతీ మొక్క నీ జియో టాగింగ్ ద్వారా మొక్కలను మున్సిపాలిటీ పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.

అదేవిధంగా ఆగస్టు 1 నుంచి మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్లాస్టిక్ కవర్లు వాడకాన్ని నియంత్రించడం జరుగుతుందని, ప్లాస్టిక్ కవర్లు అమ్మే వ్యాపారులకు ఆగస్టు 1వ తారిఖ్ వరకు గడువు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆగస్టు 1 వ తేది నుంచి ఆగస్టు 15వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్లాస్టిక్ కవర్లు అమ్మకాలను ముసివేయించడం జరుగుతుందన్నారు. ఆగస్టు 15 తరువాత మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్లాస్టిక్ కవర్ల అమ్మకం జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

అదేవిధంగా రాబోయే ఆగస్టు 15 , 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని క్యాంప్ గ్రౌండ్ నందు దాదాపు 10 వేల మంది విద్యార్థులతో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే రోజు నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా చేయబోయే పలు కార్యక్రమాల గురించి తెలియజేయడం జరుగుతుందన్నారు.

అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో టాయిలేట్స్ నిర్మాణం కోసం ఎవరైనా దాతలు ఉంటే స్వచ్చంద్దంగా ముందుకు రావాలని కోరడం జరిగిందన్నారు. అదే విధంగా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి దాతలు, స్వచ్చంధ సంస్థలు ముందుకు రావాలని పిలుపును ఇచ్చారు. అదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు అందరూ ప్రతిఒక్కరు ఒక్క మొక్కని నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవడం ద్వారా నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తులో మిర్యాలగూడలో పర్యావరణ సమస్య, వేసవిలో అధిక ఉష్ణోగ్రత ప్రభావము లేకుండా ఉంటుంది అని అన్నారు.

మనం బాధ్యతగా చేసే ఈ కార్యక్రమాల ద్వారా మన ఐకమత్యం ద్వారా తెలంగాణ లోని 119 నియోజకవర్గాలు మన మిర్యాలగూడ వైపు చూసేలా మనం అభివృద్ది చేసుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీనివాసరావు తహసిల్దార్ హరిబాబు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

BREAKING : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తిమింగలం..!

BREAKING : PHCని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్..!

రూ.లక్షలోపు 40 లక్షల మంది రైతులు.. 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారు..?

BIG BREAKING : భద్రాద్రి జిల్లాలో వరదలో చిక్కుకున్న 30 మంది కూలీలు.. హెలికాప్టర్ సహాయంతో రక్షించిన ఎన్డిఆర్ఎస్ సిబ్బంది..!

మరిన్ని వార్తలు