Good News : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. రేవంత్ రెడ్డి మరో కొత్త పథకం..!
Good News : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. రేవంత్ రెడ్డి మరో కొత్త పథకం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ శుభవార్త తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ప్రారంభిస్తుండగా మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చారు. ఆరు గ్యారంటీలతోపాటు హామీలు ఇవ్వని వాటిని కూడా కొత్తగా తీసుకొస్తున్నారు.
సివిల్స్ సాధించాలనుకునే యువతకు కొత్త పథకాన్ని తీసుకువచ్చారు. సింగరేణి సంస్థ సౌజన్యంతో ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం” పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకాన్ని శనివారం ప్రజాభవన్ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తో కలిసి లో ప్రారంభించారు.
సివిల్స్ సాధించాలనుకునే యువతకు ఆర్థిక ఇబ్బందులు ఆటంకంగా మారకూడదని ఉద్దేశంతో ఈ నూతన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన వారికి ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందన్నారు. సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.









