BREAKING : జగిత్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్..!
BREAKING : జగిత్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్..!
జగిత్యాల జిల్లా ప్రతినిధి, (మన సాక్షి)
ప్రస్తుతం కూరుస్తున వర్షాలు దృష్ట్యా వాతావరణ శాఖ వారు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి, సత్య ప్రసాద్ సూచించారు. వర్ష సూచన ఉన్న దృష్ట్యా వాగులు పొంగిపొర్లి చెరువులు కుంటలు నిండుకుండ లాగా ఉన్నాయీ కావున ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటలు వద్దకు పిల్లలు, యువత ఎవరూ చెరువుల వైపు వెళ్ళొద్దు అని అన్నారు. చెరువుల వద్ద, వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు.
వర్షానికి ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టి ఇండ్లు కూలిపోయే అవకాశం ఉంటుందని అందులో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయం కోసం కు డయల్ 100 సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీసు అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని. వర్షాల దృష్ట కరెంటు స్తంభాల దగ్గర కు ఎవరు వెళ్లకూడదు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మధు సూదన్, డిపిఓ దేవరాజ్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, ఎంపీడీవో, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :










