తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

విధులకు గైర్హాజరైతే చర్యలు.. ఆసుపత్రి, పాఠశాల, బ్యాంకులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!

విధులకు గైర్హాజరైతే చర్యలు.. ఆసుపత్రి, పాఠశాల, బ్యాంకులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!

నల్లగొండ, మనసాక్షి : 

విధులకు గైరాజలైతే చర్యలు తీసుకోనున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు.  మంగళవారం నల్గొండ జిల్లాలో నార్కట్ పల్లి మండలంలో పిహెచ్సి సెంటర్ ను, ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలను తనిఖీ చేయడంతో పాటు బ్యాంకులలో రుణమాఫీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. 

ప్రైవేట్ ఆస్పత్రుల మాదిరిగానే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా, నార్కెట్ పల్లి మండలం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్ తో పాటు, పురుష, మహిళా వార్డులు, డెలివరీ గది, వాక్సినేషన్ గది, ల్యాబ్ ను తనిఖీ చేశారు.

ప్రతిరోజు ఎన్ని టెస్టులు టి- డయాగ్నిస్టిక్ సెంటర్ కు పంపిస్తున్నారని, అవుట్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారని, డాక్టర్ ఆదిత్యను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు 70 నుండి 80 వరకు ఓపి వస్తున్నదని డాక్టర్ తెలియజేశారు. పక్కనే ఉన్న యునాని ఆస్పత్రిని సైతం జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి ఓపి రిజిస్టర్ ను పరిశీలించారు. ప్రతి రోగి వివరాలను చిరునామా, సెల్ ఫోన్ నెంబర్ తో సహా తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పారు.

అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో పడకలన్నీ పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకించి పి హెచ్ సి లో ఉండే బెడ్లకు క్రమ సంఖ్యను ఇవ్వాలని అన్నారు. ఆపరేషన్లు తప్ప తక్కిన అన్ని కేసులు పి హెచ్ సికి వచ్చేలా చూడాలని అన్నారు.

ఎస్బిఐలో ఆకస్మిక తనిఖీ : 

అనంతరం జిల్లా కలెక్టర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రుణమాఫీ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లో ఇప్పటివరకు రుణమాఫీ పొందిన రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నార్కెట్ పల్లి ఎస్బిఐ నుండి 484 మందికి లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ అయ్యాయని బ్యాంక్ మేనేజర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ రుణమాఫీ కోసం బ్యాంకుకు వచ్చిన రైతులతో ముఖాముఖి మాట్లాడారు.

తనకు 24 వేల రూపాయల రుణమాఫీ డబ్బులు తన ఖాతాలో జమఅయ్యాయని, నార్కెట్ పల్లి కి చెందిన రైతులు జిల్లా కలెక్టర్ తెలిపారు .2008 కి సంబంధించి తీసుకున్న రుణాలు మాఫీ కాఫీ కాలేదని కొందరు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, రాష్ట్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ నుండి 2023 డిసెంబర్ వరకు తీసుకున్న రెండు లక్షల రూపాయల రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని ఆయన స్పష్టం చేశారు.  మరి కొంతమంది లక్ష రూపాయల పరిమితికి మించి రుణమాఫీ లో ఉండగా వారికి ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు.

ప్రభుత్వ పాఠశాల తనిఖీ

జిల్లా కలెక్టర్ నార్కెట్ పల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి వనమహోత్సవం కింద పాఠశాలలో మొక్కలు నాటారు. పాఠశాలలో చేపట్టిన తరగతి గదుల మరమ్మతులు, టాయిలెట్ల మరమ్మతు, ఇతర నిర్మాణాల వంటి పనులన్నీటిని 15 రోజుల్లో పూర్తి చేయాలని, ప్రభుత్వ పాఠశాల డైనింగ్ తో పాటు, కిచెన్ అన్నింటిని ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దాలని, ఇందుకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరో మూడు టాయిలెట్లు కావాలని కోరగా తక్షణమే ఉపాధి హామీ పథకం కింద మూడు టాయిలెట్ల నిర్మాణాలను చేపట్టాలని పక్కనే ఉన్న ఎంపీడీవో ఉమేష్ ను ఆదేశించారు. పాఠశాలకు 2 కంప్యూటర్లు కావాలని కోరగావెంటనే వాటిని మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. టీచర్లందరూ క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని, ఒకవేళ ఎవరైనా గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ 10 వ తరగతి విద్యార్థులతో సోషల్ స్టడీస్ డిజిటల్ తరగతుల బోధనను పరిశీలించారు .సంఘటిత, అసంఘటిత రంగాలు, సంబంధించిన తదితర అంశాలను ప్రశ్న జవాబుల ద్వారా చెప్పారు. అందరు బాగా చదవాలని, మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని అన్నారు. నార్కెట్పల్లి మండల ప్రత్యేక అధికారి, డి ఆర్ డి ఓ నాగిరెడ్డి, పంచాయతీరాజ్ ఈ ఈ భూమన్న ,డి ఈ మహేష్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి : 

BUDGET 2024: మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం, వ్యవసాయం, గృహ నిర్మాణ రంగాలకు కేటాయింపులు, ఉద్యోగాలకు భారీ ప్రోత్సాహం.. బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు

Jurala project : జూరాలకు కొనసాగుతున్న భారీ వరద… తెరుచుకున్న 37 గేట్లు..!

రుణమాఫీ ప్రక్రియను బ్యాంకులలో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు