ఈ పంతులు మాకోద్దు..! ఆయన వస్తే.. పక్క స్కూల్ కు పంపిస్తాం.. MEO వద్ద విద్యార్ధుల తల్లిదండ్రులు మొర..!
ఈ పంతులు మాకోద్దు..! ఆయన వస్తే.. పక్క స్కూల్ కు పంపిస్తాం.. MEO వద్ద విద్యార్ధుల తల్లిదండ్రులు మొర..!
నేలకొండపల్లి, మన సాక్షి:
సమయ పాలన పాటించడు.. విద్యార్ధులతో పని చేయిస్తాడు.. అసలు బడికి రాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఈ పంతులు మాకోద్దు అంటూ తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని మంగాపురం చిన్నతండా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సురేష్ తీరు పై స్థానికులు, విద్యార్ధుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం మండల విద్యాశాఖాధికారి చలపతిరావు పాఠశాలలో క్షేత్ర స్తాయిలో విచారణ చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు. గ్రామ పెద్దలతో చర్చించారు. మా విద్యార్ధులు జీవితాలను బాగు -చేసుకుందామంటే..ఉపాధ్యాయుడు మాత్రం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.
సమయ పాలన లేకుండాఆలస్యంగా బడికి రావటం, తొందరగా బడి మూసివేసి వెళ్లటం చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా కొన్ని సందర్భాలలో బడికి అసలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడికి పంతులకు పని చేయటానికి పంపాలా…అని మండిపడ్డారు. ఆయన బడికి వస్తే…తాము పిల్లలను వేరే బడికి పంపిస్తామని పేర్కొన్నారు.
లేదా ఈ పంతులను మార్చాలని, కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేశారు. యంఈవో బాలిన చలపతిరావు జోక్యం చేసుకుని తల్లిదండ్రులుమాట్లాడారు…మార్పు తీసుకొస్తామని, ఇక నుంచి అలా జరగకుండా చూస్తామని హమీ ఇచ్చారు. నెల రోజులలో తీరు మారకుంటే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఉన్నారు.
ALSO READ :
Job Vacancies : ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!
కేటీఆర్ కు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.. కేటీఆర్ స్పందన ఏంటి..!
BREAKING : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పొడిగింపు..!
విధులకు గైర్హాజరైతే చర్యలు.. ఆసుపత్రి, పాఠశాల, బ్యాంకులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!









