Nagarjunasagar : సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు.. ఇన్ ఫ్లో 1.44 లక్షల క్యూసెక్కులు.. Latest Update
Nagarjunasagar : సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు.. ఇన్ ఫ్లో 1.44 లక్షల క్యూసెక్కులు.. Latest Update
నాగార్జునసాగర్, మన సాక్షి :
నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లతో పరుగులు తీస్తూ వస్తుంది. కృష్ణ నది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్ని నిండుకుండలా తయారయ్యాయి. సోమవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్న వరద నీరు భారీగా ఉండడంతో అనుకున్న దానికంటే ఒక రోజు ముందుగానే శ్రీశైలం నుండి క్రస్ట్ గేట్లు ద్వారా నీటిని సాగరకు విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను మూడింటిని పది అడుగుల మేరకు ఎత్తి 81000 క్యూసెక్కుల నీటిని దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు.
దీనితోపాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 63,000 క్యూసెక్కుల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుండి వస్తున్న వరదనీరు ఉదృతి ఎక్కువగా ఉండడంతో శ్రీశైలం నుండి విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని మరింతగా పెంచే అవకాశం ఉంది.
నాగార్జునసాగర్ జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 513అడుగులు గా ఉంది. కుడి కాలువ ద్వారా 5882.క్యూసెక్కులు , ఎస్. ఎల్. బి .సి. ద్వారా 800 క్యూసెక్కులు. విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ కు 1,44000 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుకుంటుంది.
కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
నాగర్జున సాగర్ ప్రాజక్ట్ జలాలు నిలిచే ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, నది పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలతో పాటు, నది పరివాక ప్రాంత ప్రజలెవ్వరు ఈత కోసం,బట్టలు ఉతికేందుకు నదిలోకి వెళ్ళవద్దని, అలాగే మత్స్యకారులు చేపలు పట్టేందుకు నదిలోకి వెళ్ళకూడదని, పశువులను సైతం నదిలోకి తీసుకు వెళ్లడం, నది దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
నది పరివాహక ప్రాంత మండలాల, గ్రామాల అధికారులందరూ ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను అప్రమత్తం చేయాలని ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని, ఈ విషయమై సంబంధిత గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు.
ఇవి కూడా చదవండి :
Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!
District collector : కృష్ణానది పరివాహక ప్రాంతంలో అలర్ట్.. జిల్లా కలెక్టర్ హెచ్చరిక..!
Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తిన అధికారులు..!









