TOP STORIESBreaking Newsజాతీయం

Srisailam : శ్రీశైలంకు 4.24 లక్షలు, సాగర్ కు 5.24 లక్షల క్యూసెక్కుల వరద.. 575 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం.. Latest Update

Srisailam : శ్రీశైలంకు 4.24 లక్షలు, సాగర్ కు 5.24 లక్షల క్యూసెక్కుల వరద.. 575 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం.. Latest Update

మనసాక్షి, తెలంగాణ బ్యూరో :

కృష్ణ నదిపై ఉన్న జలాశయాలు నీటి కుండలా మారాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల గేట్లు అన్ని ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఆల్మట్టి నుంచి మొదలుకొని శ్రీశైలం డ్యాం వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు తెరిచే ఉన్నాయి. ఇక సాగర్ జలాశయ గేట్లు కూడా సోమవారం తీర్చుకోనున్నాయి.

శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల ప్రాజెక్టు నుంచి 4,24,466 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు 5.24 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 880 అడుగులుగా ఉంది.

నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి 5.24 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 34 వేల క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో కొనసాగుతుంది. సాగర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 265 టీఎంసీల నీరు ఉన్నది. 590 అడుగుల నీటిమట్టం గాను 575 అడుగుల నీటిమట్టం చేరింది.

గంట గంటకు సాగర్ జలాశ నీటిమట్టం పెరుగుతుండడంతో రేపు (సోమవారం) మధ్యాహ్నం వరకు సాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది. అందుకుగాను సోమవారం ఉదయమే గేట్లు ఎత్తేందుకు అధికారులు అప్రమత్తమై ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి : 

మిర్యాలగూడ : కమీషన్ ఆశ చూపి.. భారీ మోసం..!

ACB : రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఒకేసారి ముగ్గురు దొరికారు..!

Nagarjunasagar : సాగర్ ఆయకట్టు రైతులకు శుభవార్త.. ఎడమ కాలువకు నీటి విడుదల..!

రెండేళ్ల తర్వాత ఆయకట్టులో సాగు.. ఆనందంలో రైతులు..!

మరిన్ని వార్తలు