TGSRTC : నాగార్జునసాగర్ టూర్ వెళ్తున్నారా.. ఆర్టీసీ కీలక ఆఫర్..!,
TGSRTC : నాగార్జునసాగర్ టూర్ వెళ్తున్నారా.. ఆర్టీసీ కీలక ఆఫర్..!
మన సాక్షి, నల్గొండ :
నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. అందుకోసం తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది.
నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి ఆదివారం నాగార్జునసాగర్ కు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ బస్సులు నడపనున్నట్లు ఆర్టిసి డిఎం శ్రీనాథ్ తెలిపారు.
నల్లగొండ నుంచి ఆదివారం ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరి నాగార్జునసాగర్ లోని బుద్ధవనం, సాగర్ డ్యాం, ఎత్తిపోతల వరకు వెళ్లి తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు తిరుగు ప్రయాణం ఉంటుందని తెలిపారు.
నాగార్జునసాగర్ కు బయలుదేరే ప్రత్యేక బస్సులలో టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ధరలను నిర్ణయించింది. పెద్దలకు 400 రూపాయలు, పిల్లలకు 200 రూపాయల టికెట్ గా నిర్ణయించింది. అంతేకాకుండా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
సాగర్ టూర్ కు బయలుదేరే ప్రత్యేక బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం లేదని డిఎం తెలిపారు. ఆర్టీసీ డిపోకు వచ్చి బుక్ చేసుకోవచ్చని, లేదంటే ఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ALSO READ :
Krishna Floods : కాసులు కురిపిస్తున్న కృష్ణా నది వరద..!
Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!
Viral : హాజరు వేయాలంటే ముద్దు ఇవ్వాలి.. తోటి ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయుడు వీడియో కాల్.. (Video)









