మిర్యాలగూడ : ఎత్తిపోతల పథకాలపై చీఫ్ ఇంజనీర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!
మిర్యాలగూడ : ఎత్తిపోతల పథకాలపై చీఫ్ ఇంజనీర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామంలో దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం సైట్ ను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి తో కలిసి పరిశీలించి అధికారులతో సమీక్షించారు.
ముందుగా చిట్యాల గ్రామం దున్నపోతుల గండి లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ,స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి,ఇతర ప్రజా ప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ముందుగా చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మిర్యాలగూడ నియోజకవర్గంలో చేపట్టనున్న దున్నపోతుల గండితో పాటు ,ఇతర ఎత్తిపోతల పథకాల పై వివరించారు.
అడవిదేవుల పల్లి మండలం చిట్యాల గ్రామం వద్ద చేపట్టిన దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం కింద 12239 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 219.19 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగిందని, ఇందుకు సంబంధించి పంపు హౌస్, అప్రోచ్ కాలువల మట్టి తవ్వకం పనులు పురోగతిలో ఉన్నాయని, ఈ ఎత్తిపోతల ద్వారా ఉల్సాయపాలెం, మొల్కచర్ల, బాల్నేపల్లి, చాంప్ల తండా, కొత్త నందికొండ, అడవిదేవులపల్లి, చిట్యాల గ్రామాల లోని 12,239 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.
దామరచర్ల మండలం బోత్తలపాలెం ఎత్తిపోతల పథకం కింద 8610 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించడం జరిగిందని, ఇందుకు 259.25 కోట్ల రూపాయల పరిపాలన మంజూరు కావడం జరిగిందని, బోత్తలపాలెం ,రాజాగట్టు, దామరచర్ల, నర్సాపూర్, తాళ్ల వీరప్ప గూడెం ,కొత్తపల్లి, వాడపల్లి గ్రామాలలోని 8610 ఎకరాలకు సాగునీరు అందుతున్నదని వివరించారు.
వీర్లపాలెం -2 ఎత్తిపోతల పథకం కింద 2,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకుగాను, 32.22 కోట్ల రూపాయలు పరిపాలన అనుమతి మంజూరు చేయడం జరిగిందని, వీర్లపాలెం, ముదిమాణిక్యం, అడవిదేవులపల్లి లోని 2500 ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు.
తోపుచర్ల ఎత్తిపోతల పథకం కింద 9 కోట్ల 30 లక్షల రూపాయల ప్రతిపాదిత వ్యయంతో 316 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతి మంజూరు చేసిందని ,ఇందులో భాగంగా తోపుచెర్ల చిన్న చెరువు, పెద్ద చెరువు, బల్పవానికుంట, పుచ్చకాయల గూడెం, గణపతి వారి గూడెం, బొమ్మకల్ గ్రామాలకు లోని 316 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలియజేశారు.
కేశవపురం ఎత్తిపోతల పథకం ద్వారా 5875 ఎకరాలకు సాగునీరు అందించాలని, 75.9 3 కోట్ల రూపాయలు ప్రభుత్వం పరిపాలన అనుమతి మంజూరు చేసిందని ,ఇందులో భాగంగా కేశవపురం, కొండరపోలు దామరచర్ల లోని 5875 ఎకరాలకు సాగునీరు అందనున్నదని ఆయన వివరించారు.
ALSO READ :
Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!
Nagarjunasagar : నాగార్జునసాగర్ సందర్శించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే.. ప్రముఖులు..!
Viral News : ఏడవ తరగతి కుర్రాడి లీవ్ లెటర్.. చదివితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!










