HYDRA : హైడ్రా బుల్డోజర్లు జన్వాడ ఫామ్ హౌస్ వైపేనా.. అధికారుల కొలతలు ప్రారంభం..!
HYDRA : హైడ్రా బుల్డోజర్లు జన్వాడ ఫామ్ హౌస్ వైపేనా.. అధికారుల కొలతలు ప్రారంభం..!
శంకర్‌పల్లి, (మన సాక్షి) :
హైదరాబాద్ వాసులను హైడ్రా హడలెత్తిస్తోంది. ఎఫ్ టి ఎల్ పరిధిలో తమ ఇల్లు ఫామ్ హౌస్ లు ఉన్నాయేమో అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సినీ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ నేలమట్టం చేసిన హైడ్రా.. జన్వాడ ఫామ్ హౌస్ వైపు బుల్డోజర్లు వెళ్తాయా అని చూస్తున్నారు.
శంకర్‌పల్లి మండల పరిధిలోని జన్వాడ గ్రామ శివారులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఎఫ్ టిఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తోంది.
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్నేహితుడు ప్రదీప్ రెడ్డికి చెందిన జన్వాడ ఫాంహౌస్ కు ఇరిగేషన్ అధికారులు వెళ్లారు. ఫాంహౌస్ లో అధికారులు కొలతలు వేస్తున్నారు. చట్ట నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టారా? లేదా అనే దానిపై అధికారులు సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా రోజుల నుండి వార్తలలో నిలుస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సరిహద్దులను, సర్వే నెంబర్లను పరిశీలించేందుకు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగారు.. బుల్కాపూర్ నాలా( ఫిరంగినాల) సర్వేలో భాగంగా జన్వాడ ఫామ్ హౌస్ ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా నిర్మించారని ఫిర్యాదులు రావడంతో మంగళవారం కొలతలు తీసుకునేందుకు అధికారులు ఫామహౌజ్కు వచ్చారు.
ఇది ఇలా ఉంటే హైడ్రా ఏర్పడిన నేపథ్యంలో ఈ ఫామ్ హౌజ్ యజమాని ప్రదీప్ రెడ్డి దీనిపై హైకోర్టు ను ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు చట్ట ప్రకారం ముందుకు పోవాలని ఆధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు కొలతలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఈ సర్వేకోసం శంకర్‌పల్లి తాసిల్దార్ కార్యాలయానికి చెందిన సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇరిగేషన్ విభాగానికి చెందిన వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చి నాలా స్థితిగతులను పరిశీలన జరుపుతున్నారు, బుల్కాపూర్ నాలా హద్దులు ఆక్రమణల విషయంలో ఇప్పుడే పూర్తి నిర్ధారణకు రాలేమని,, పై అధికారుల సూచనల మేరకు పూర్తి వివరాలు సేకరించి వారికి అందించనున్నట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ తెలిపారు.
కాగా, చెరువు ఎఫ్ టిఎల్ లో ఫామహౌస్ ను నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఫామ్ హౌస్ తనది కాదని, లీజుకు తీసుకున్నానని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా అధికారులు అక్కడికి చేరుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
LATEST UPDATE :
మిర్యాలగూడ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీఎంఆర్ఎఫ్ స్కాం.. అరెస్టుకు సిద్ధమైన సిఐడి..!
HYDRA : హైడ్రా హడల్.. కూల్చేది 134 చెరువుల్లో అన్ని వేల నిర్మాణాలున్నయా..!
తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!









