Heavy Rain : భారీ వర్షాలు.. నేడు ఆయా జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..!
Heavy Rain : భారీ వర్షాలు.. నేడు ఆయా జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉంది. దాంతో రెండు రాష్ట్రాలలో కొండపోత వర్షాలు కురువనున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులను ప్రకటించింది. పశ్చిమ మధ్య వాయు దిశగా ఆల్పపీడనం కదులుతున్నందున సోమవారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.
దాంతో ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాలలో కొండబోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆయా జిల్లాలకు రెడ్ అండ్ ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది, ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ, ఉమ్మడి గోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాలలో ఆయా జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం సెలవులు ప్రకటించారు. పరిస్థితిని బట్టి మంగళవారం నుంచి వేదావిధిగా పాఠశాలలు తెర్చుకుంటాయని పేర్కొన్నారు.
తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావం తెలంగాణలో ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
అదేవిధంగా ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, భునగిరి జిల్లాల్లో కూడా వర్షాలు పడనున్నాయి. ఆయా జిల్లాలకు ప్రభుత్వం ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.
LATEST UPDATE :
Runamafi : రుణమాఫీ పై స్పష్టత.. మాఫీ కాని వారికి ఎప్పుడంటే..!
తెలంగాణలో మరోసారి భారీ వర్ష సూచన.. ఆయా జిల్లాల్లో అలర్ట్..!
బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?
Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!










