మిర్యాలగూడ : యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో చోరీ.. భద్రత లోపంపై ఎమ్మెల్యే ఆగ్రహం..!
మిర్యాలగూడ : యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో చోరీ.. భద్రత లోపంపై ఎమ్మెల్యే ఆగ్రహం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో చోరీ సంఘటన చోటుచేసుకుంది. ధర్మల్ ప్లాంట్ లో చోరీ జరగటం ఇది రెండవసారి. దాంతో థర్మల్ ప్లాంట్ అధికారులతో సోమవారం స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు.
భద్రత లోపం వల్లనే చోరీ జరిగిందని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ ప్లాంట్ లో చోరీ జరగడం ఇది రెండవ సారి, భద్రత కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారని, దీనికి కారణం అయిన ప్రతిఒక్కరిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.
మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు బలంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇది ప్రభుత్వం ఖజానా.. అంటే ప్రజలది, ప్రజల ధనాన్ని దొచ్చుకోకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులది అంటే మనదే అన్నారు.
గత పాలనలో జరిగిన పొరపాట్లను జరగకుండా. ప్రతిఒక్కరూ బాధ్యతగా ఉండాలని అన్నారు. మరో సారి ఇలాంటి ఘటనలు జరిగితే ప్రతిఒక్కరిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, పవర్ ప్లాంట్ ఎస్ ఈ, ఇతర ఉన్నత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
LATEST UPDATE :
High Court : హైకోర్టు కీలక ఆదేశం.. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా..!
Good News : మహిళలకు భారీ శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..!
Khammam : వరద ప్రాంతాల్లో 820 ప్రత్యేక బృందాలతో వైద్య సేవలు..!
Runamafi : రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!









