Nalgonda : తప్పుడు పత్రాలతో ఇండ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న జర్నలిస్టులపై చర్య తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు..!
Nalgonda : తప్పుడు పత్రాలతో ఇండ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న జర్నలిస్టులపై చర్య తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు..!
నల్లగొండ, మనసాక్షి:
జీవో 59 పేరుతో తప్పుడు పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న జర్నలిస్టులపై చర్య తీసుకోవాలని కోరుతూ నల్లగొండ కలెక్టర్ నారాయణరెడ్డి కి ఎస్పీ శరత్చంద్ర పవర్ కు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు సోమవారం ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు ) అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పట్టాలు అందజేశారని, ఇక రాష్ట్రవ్యాప్తంగా జిల్లా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పై దృష్టి పెడుతున్నారని, ఈ మేరకు ఇప్పటికే నల్గొండ జర్నలిస్టులకు ఫ్లాట్ల అంశాన్ని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ వినతి పత్రం సమర్పించా మన్నారు.అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వ విధి విధానాలు రాగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలియజేశారు.
గతంలో 59 జీవో అడ్డుపెట్టుకొని తప్పుడు నివాస పత్రాలు, నకిలీ బిల్లులు పెట్టి కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, జిల్లా కలెక్టర్, ఎస్పీ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డికి వినతిపత్రం అందజేయడం జరిగిందని వారు ఈ విషయములను రెండు రోజులలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కృష్ణారెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు టి యుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, దోసపాటి సత్యనారాయణ, కిరణ్ రెడ్డి, అశోక్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి , సివిఆర్ రాము, మాధురి యాదగిరి, పంచలింగం, గోలి విజయ్ కుమార్,
మల్లేష్ యాదవ్, జుబేర్ హైమద్, అతిక్ హైమత్, అంజత్ ఖాన్, దోటి శ్రీను, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు కెమెరామెన్స్ శంకర్, వెంకట్, నరేందర్, ఎస్ఎండిఏ జిల్లా అధ్యక్షులు పిట్టల రామకృష్ణ , వెనమల రమేష్ బాబు, అశోక్ నరసింహ స్వామి, జాజాల కృష్ణ . సత్యం తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
మిర్యాలగూడ : యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో చోరీ.. భద్రత లోపంపై ఎమ్మెల్యే ఆగ్రహం..!
High Court : హైకోర్టు కీలక ఆదేశం.. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా..!
Runamafi : రుణమాఫీ పై స్పష్టత.. మాఫీ కాని వారికి ఎప్పుడంటే..!
డయల్ 100 కు ఫోన్.. రెండు రోజుల జైలు శిక్ష.. ఎందుకో తెలిస్తే షాక్..!










