తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువిద్యసూర్యాపేట జిల్లా

Suryapet : చిట్టి చేతులు.. భారీ సహాయం..!

Suryapet : చిట్టి చేతులు.. భారీ సహాయం..!

సూర్యాపేట, మనసాక్షి :

పకృతి వైపరీత్యం వల్ల వచ్చిన భారీ వర్షాల కారణంగా సూర్యపేట జిల్లాలో భారీ నష్టం సంభవించింది మేము సైతం వరద బాధితులను ఆదుకుంటామని చిన్నారులు ముందుకు వచ్చారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ సన్మాన కార్యక్రమం.

ఈ సంవత్సరం సూర్యాపేట జిల్లాలో వరదల కారణంగా బాగా నష్టం జరగడం వల్ల సంబరాలు జరుపుకోవడం సముచితం కాదని భావించి, అట్టి సన్మాన కార్యక్రమానికి సేకరించిన డబ్బులను సూర్యాపేట జిల్లాలోని వరద బాధితులకు సహాయార్థం కావాలని పిల్లలు నిర్ణయించి ఉపాధ్యాయుల సహకారంతో ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

మా డబ్బులను సూర్యాపేట జిల్లాలో నష్టపోయిన వరద బాధితులకు అందజేయాలని ఎమ్మెస్సార్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు 1,50, 116 రూపాయలు, ఎంఎస్ఆర్ సెంట్రల్ స్కూల్ దురాజుపల్లి విద్యార్థులు 1,00 116 రూపాయలు మొత్తం 2,50,232 రూపాయలు, పాఠశాల కరస్పాండెంట్ కోల్లు శ్రీనివాస్, డైరెక్టర్ బి ప్రభాకర్, ఎంఎస్ఆర్ సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమా, ఎం ఎస్ ఆర్ కిడ్స్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు విద్యార్థులు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కు తమ చేతుల మీదుగా అందజేశారు .

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న వయసులోనే విద్యార్థులకు సేవ దృక్పథం, సామాజిక బాధ్యత కలిగి ఉండటం అభినందనీయమని ,ఇదే దృక్పథాన్ని కొనసాగించాలని కలెక్టర్ కోరారు. ఉపాధ్యాయులు స్కూల్ యాజమాన్యం సముచిత నిర్ణయాన్ని కలెక్టర్ ప్రసంషించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఇన్చార్జి డిఆర్డిఏ పిడి వివి అప్పారావు కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి సిపిఓ ఎల్ కిషన్ విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

LATEST UPDATE : 

20 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం సీజ్..!

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు స్వీకరణ.. 17 వరకు గడువు పెంపు..!

Runamafi : రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

Good News : మహిళలకు భారీ శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..!

మరిన్ని వార్తలు