మిర్యాలగూడ : టిప్పర్ ను ఢీకొన్న ఆంబులెన్స్.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు..!
మిర్యాలగూడ : టిప్పర్ ను ఢీకొన్న ఆంబులెన్స్.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఆగి ఉన్న టిప్పర్ ను ఆంబులెన్స్ వెనుక నుంచి ఢీకొనగా ఒకరు మృతి చెంది ముగ్గురికి గాయాలైన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కృష్ణాపురం సమీపంలో చోటు చేసుకుంది. రూరల్ ఏఎస్ఐ రాములు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం..
నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న అంబులెన్స్ కృష్ణాపురం సమీపంలోకి రాగానే అజాగ్రత్తగా రిపేరు కారణంగా రోడ్డుపై నిలిపి ఉన్న టిప్పర్ ను శుక్రవారం రాత్రి 11 గంటలకు ఆంబులెన్స్ ఢీ కొట్టింది. దాంతో అంబులెన్స్ డ్రైవర్ రాకేష్ (24) అక్కడికక్కడే మృతి చెందారు. అంబులెన్స్ లో ఉన్న డయాలసిస్ పేషెంట్ సునీత తో పాటు ఆమె బంధువు సుబ్బమ్మ, కేర్ టేకర్ శివకుమార్, టెక్నీషియన్ సునీల్ కుమార్ ఉన్నారు.
గాయాలైన వారిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కిడ్నీ పేషెంట్ సున్నితను హైదరాబాద్ కు తరలించారు. మృతుడు తల్లి పుష్పలత ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్ మను భాష పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్ ఐ తెలిపారు.
LATEST UPDATE :
Nagarjunasagar : సాగర్ సందర్శించిన హైకోర్టు న్యాయ మూర్తి..!
మిర్యాలగూడ : గణేష్ లడ్డు వేలం పాట.. దగ్గించుకున్న రైస్ మిల్లర్..!
Suryapet : ఆయిల్ ఫామ్ సాగుతో నికర ఆదాయం.. త్వరలో ఉమ్మడి జిల్లాలో కంపెనీ ఏర్పాటు..!









