Balineni : వైసీపీకి భారీ షాక్.. మాజీ మంత్రి బాలినేని రాజీనామా..!
Balineni : వైసీపీకి భారీ షాక్.. మాజీ మంత్రి బాలినేని రాజీనామా..!
మన సాక్షి , అమరావతి :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలిలేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాజీనామా లేఖను జగన్ మెయిల్ ద్వారా పంపించారు. జనసేన పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అనంతరం పార్టీలో చేరే విషయంపై ప్రకటించనున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆ పార్టీలో వైవి సుబ్బారెడ్డి తో వివాదాలు ఉన్నట్లు సమాచారం. దాంతో ఆయన పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఒంగోలు పార్లమెంటు టికెట్ విషయంలో జగన్ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆయనకు గత కొంతకాలంగా వైవి సుబ్బారెడ్డి తో విభేదాలు ఉన్నాయి.
ప్రజల తీర్పు శిరోధార్యం అని, రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని, రాజకీయాలు వేరు బంధుత్వం వేరు అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా బాలినేని గెలుపొందారు. 2019లో వైసీపీలో తొలి క్యాబినెట్లో మంత్రి పదవి చేశారు. ఆ తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవి నుంచి జగన్ తొలగించారు.
మంత్రి పదవి నుంచి తొలగించటంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తాను కొన్ని కారణాలవల్ల వైసిపికి రాజీనామా చేసినట్లు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఏది ఏమైనా బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు వైసీపీని వీడటంతో ఆ పార్టీకి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి.
LATEST UPDATE :
Narayanpet : రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
Komatireddy : తెలంగాణ రాష్ట్ర ఘనత అమరులదే.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
UPI : యూపీఐ పేమెంట్ ల ద్వారా మోసాలు.. 13 మంది ముఠా అరెస్ట్..!









