తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలురాజకీయం

Jagityal : ఆంక్షలు లేకుండా రైతు రుణ మాఫీ చేయాలి.. బీఆర్ఎస్ భారీ ధర్నా..!

Jagityal : ఆంక్షలు లేకుండా రైతు రుణ మాఫీ చేయాలి.. బీఆర్ఎస్ భారీ ధర్నా..!

జగిత్యాల, మన సాక్షి :

ఏలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణ మాఫీ చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట బిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ మూడు విడతలుగా చేసినప్పటికీ రైతులకు ఇంకా రుణమాఫీ కాక రాష్ట్ర జిల్లాల వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారని రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, కుటుంబ ధ్రువీకరణ పత్రం అంటూ సభ్యులకు సాకు చూపెడుతూ చాలామంది రైతులకు రుణమాఫీ చేయకుండా రైతులతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు.

దీంతో రుణమాఫీ అవుతుందో కాదో అని రైతులు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఇటీవలే ఒక రైతు ప్రభుత్వం కార్యాలయ ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకుని మరణించడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు.

రెండు లక్షలకు పైగా రుణమున్న రైతులకు నాలుగో విడతలో రుణమాఫీ చేస్తారని చెప్పారు కానీ ఇంతకు రుణమాఫీ కాక రైతులు బ్యాంకులు వ్యవసాయ అధికారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. రైతులకు వారి యొక్క రుణాన్ని వెంటనే మాఫీ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వారితోపాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ దావవసంత సురేష్ , కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవి శంకర్ , డిసిఎంస్ ఛైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి ,బిఆర్ఎస్ నాయకులు అయ్యోరి రాజేష్,సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,కాటిపెల్లి, అదిరెడ్డి, తోట శ్రీనివాస్, డబ్బా రాజేందర్, ముద్దం శరత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Balineni : వైసీపీకి భారీ షాక్.. మాజీ మంత్రి బాలినేని రాజీనామా..!

Devarakonda : మైనార్టీ గురుకులంలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్.. ఆచూకీ చెప్పాలని విద్యార్థుల తల్లిదండ్రులు..! 

Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..! 

Ganesh Laddu : రికార్డ్ బ్రేక్.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డు..!

మరిన్ని వార్తలు